Bigg Boss 5 Telugu: శ్వేత కోసం అనీమాస్టర్ అందుకే ఏడ్చిందా..?

బిగ్ బాస్ హౌస్ లో 6వ వారం శ్వేత వరెస్ట్ పెర్ఫామర్ గా జైల్ కి వెళ్లింది. బొమ్మల టాస్క్ లో కుషన్ లోనుంచీ కాటన్ కొట్టేసి మరీ బొమ్మలని చేసినందుకు బిగ్ బాస్ గ్రీన్ టీమ్ ని డిస్ క్వాలిఫై చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే రీజన్ చెప్పిన నలుగురు హౌస్ మేట్స్ శ్వేతని ఓటింగ్ ద్వారా జైలుకి పంపారు. మెజారిటీ ఓట్లు శ్వేతకి రావడంతో ఆరవవారం దోషిగా వరెస్ట్ పెర్ఫామర్ గా ఎంపికై శ్వేత జైలుకు వెళ్లింది.

ఇక్కడే అనీమాస్టర్ తో జైల్ నుంచీ వచ్చిన తర్వాత మాట్లాడతా.. కాస్త స్పేస్ కావాలి అంటూ మాట్లాడింది. అందుకు అనీమాస్టర్ చాలా బాధపడింది.రాత్రి అయిన తర్వాత నిద్ర పోకుండా మోజ్ రూమ్ దగ్గరే శ్వేత పిలుపుకోసం వెయిట్ చేసింది. అంతేకాదు, శ్రీరామ్ తో తన ఆవేదనని పంచుకుంది అనీమాస్టర్. తన కూతురు జైల్లో ఉంటే మనసు కష్టపడుతోందంటూ మాట్లాడింది. ఇక శ్వేత కూడా షణ్ముక్ తో మాట్లాడింది. తనకి ఏ రిలేషన్స్ వద్దంటూ అనీమాస్టర్ మాట్లాడింది టాస్క్ లో నోరు జారింది అంటూ షణ్ముక్ చెప్పినపుడు శ్వేత కళ్లలో నీళ్లు తిరిగాయి.

మా అమ్మ బతికి ఉంటే బాగుండేదని వెక్కి వెక్కి ఏడ్చింది శ్వేత. నిజానికి టాస్క్ అయిపోయిన రాత్రి అనీమాస్టర్ శ్వేత అన్నం తిన్నదా లేదా అని చెక్ చేస్కుని వచ్చి మరీ తను భోజనం చేసింది. రాత్రి చాలాసేపు శ్వేత గురించే ఆలోచింది. బిగ్ బాస్ హౌస్ లో ఈసీజన్ లో తల్లీ కూతుళ్ల సెంటిమెంట్ అనేది బాగా వర్కౌట్ అవుతుందనే చెప్పాలి.

బిగ్ బాస్ 5 ఆరవవారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు?

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Share.