సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని సినీ పరిశ్రమతో పాటు అభిమానుల సందర్శనార్థం పద్మాలయా స్టూడియోలో ఉంచారు.. కృష్ణ గారు మరణించిన రోజు రావడానికి వీలుపడక దూరప్రాంతాల్లో ఉన్న ప్రముఖులు నేడు హైదరాబాద్ చేరుకుని.. శ్రద్ధాంజలి ఘటిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.. ‘వీర సింహా రెడ్డి’ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హైదరబాద్ చేరుకున్న బాలయ్య.. సతీమణి వసుంధర, పెద్ద కుమార్తె నారా బ్రహ్మిణిలతో కలిసి వచ్చారు.
శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత కుటుంబ సభ్యులందరినీ, వాళ్ల బంధువుల్లో తనకు పరిచయం ఉన్నవాళ్లని పలకరిస్తూ.. తన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు బాలయ్య. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, కృష్ణ గారికి నివాళులు అర్పించి.. మహేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు..ఇక్కడ ఆసక్తికరమైన సంఘటన జరిగింది.. మహేష్ వెనుక నిల్చుని ఉన్న బాలయ్యకి జగన్ నమస్కారం చేశారు. బాలయ్య కూడా ప్రతి నమస్కారం చేశారు.
ఆ తర్వాత ఒకరినొకరు పలకరించుకుని కొంతసేపు మాట్లాడుకున్నారు. బాలయ్య, జగన్ విజువల్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలయ్య బాబు, జగన్ ఇలా ఓ చోట కలవడంతో ఇరువురి అభిమానులు నెట్టింట ఈ వీడియోను బాగా ట్రెండ్ చేస్తున్నారు. నందమూరి, ఘట్టమనేని కుటుంబాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు.. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన కృష్ణ ఆయన స్ఫూర్తితోనే సినిమా పరిశ్రమకి వచ్చారు.. కొన్ని సందర్భాల్లో, అనుకోని పరిస్థితుల కారణంగా ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి కానీ తమ స్నేహం ముందు అవేవీ నిలబడలేదు..
బాలయ్య కూడా ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకకి రావాలని కృష్ణను ఆహ్వానించడం.. ఆయన వచ్చి ఆశీర్వదించడం జరిగింది.. కృష్ణ సతీమణి ఇందిర గారు మరణించినప్పుడు కూడా వీరు కలిశారు.. అలాగే కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. తనకు పద్మభూషణ్ రావడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణమని కూడా చెప్పిన సంగతి తెలిసిందే.. అజాత శత్రువుగా పేరొందిన నటశేఖరుడికి అన్నీ రాజకీయ పార్టీలవారు వచ్చి నివాళులర్పించారు..
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!