యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు రెమ్యునరేషన్ గురించి ఆలోచించరు. కథకి తాను కనెక్ట్ అయితే చాలు ఒకే చెప్పేస్తారు. బాహుబలి కోసం ఐదేళ్లు కేటాయించారంటే అతని డెడికేషన్ ఏంటో అర్ధం అవుతోంది. అయితే తొలిసారి అతని పారితోషికంపై సినీ పరిశ్రమల్లో చర్చ సాగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సంప్రదించారని, అప్పుడు ప్రభాస్ 20 కోట్ల రెమ్యూనరేషన్ అడగడంతో ఆయన వెనకడుగు వేశారంట. దానివల్ల ప్రభాస్ కి కరణ్ కి మధ్య దూరం పెరిగిందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రెమ్యునరేష్ హాట్ టాపిక్.
బాలీవుడ్ హీరోలు వరుణ్ ధావన్ (25 కోట్లు), సల్మాన్ ఖాన్ (60 కోట్లు), అమీర్ ఖాన్ (50 కోట్లు), షారుక్ (40-45 కోట్లు)వరకు అందుకుంటున్నారు. అలాంటిది ప్రభాస్ కేవలం 20 కోట్లు అడగడంలో తప్పేంటి అని బాహుబలి స్టార్ కి చాలామంది తెలుపుతున్నారు. ఆయన సినిమాకు ఎంత ఖర్చుపెట్టినా అంతకు రెండింతలు వసూలు చేసే శక్తి ఉంది కాబట్టి ఈ మాత్రం చార్జ్ చేయడంలో తప్పేమీ లేదని వివరించారు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న “సాహో” కోసం 30 కోట్లు తీసుకుంటున్నారు.