తమన్నా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో సుదీర్ఘ కాలం కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో తమన్నా ఒకరు. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్లను సొంతం చేసుకున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ తన ఫొటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.