ప్రముఖ సినీ విశ్లేష సంస్థ ఐఎంబిడి ప్రతి ఏడాది ఆ సంవత్సరంలో ఎక్కువమంది ప్రజాధారణ కలిగిన నటీనటుల జాబితాను ప్రకటిస్తుంటుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన వారి జాబితాని ఈరోజు ఉదయం వెల్లడించింది. ఈ జాబితాలోని టాప్ టెన్ స్థానాల్లో టాలీవుడ్ నటులు ముగ్గురికి స్థానం లభించడం విశేషం. షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, తమన్నా, ఇర్ఫాన్ ఖాన్ లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. ఆరవ స్థానాన్ని ప్రభాస్ సొంతం చేసుకున్నారు. ఐఎంబిడి టాప్ టెన్ స్టార్స్ జాబితాలో తొలిసారి తెలుగు నటులకు అవకాశం దక్కడం ఇదే తొలిసారి. అంతేకాదు ఆరవ స్థానంలో నిలవడం మరింత ప్రత్యేకం.
హృతిక్ రోషన్ ని ప్రభాస్ అధిగమించడం గొప్పవిషయమని ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థానం పొందడం అనేది తెలుగు నటులకు ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదని సినీ విశ్లేషకులు అభివర్ణించారు. ఇక స్వీటీ అనుష్క శెట్టి ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఏడవ స్థానంలో అనుష్క శర్మ, హృతిక్ రోషన్ తొమ్మిది, కత్రినా కైఫ్ 10వ స్థానం సంపాదించుకున్నారు. దక్షిణాదికి చెందిన ముగ్గురు తారలు టాప్ టెన్ లో పొందడం ఒక ఎతైతే ఈ ముగ్గురు నటించిన బాహుబలి ద్వారానే ఆ స్థానాలు దక్కాయని ప్రకటించడం విశేషం. ఈ అరుదైన ఫీట్ సాధించిన ప్రభాస్, అనుష్క, తమన్నాలకు బాహుబలి నిర్మాణ సంస్థ శుభాకాంక్షలు చెప్పింది.