ప్రపంచంలోనే బెస్ట్ ఆడియన్స్ మన తెలుగు ప్రేక్షకులు అని అందరూ ఎందుకు అంటారో మరోసారి ప్రూవ్ అయ్యింది. మన తెలుగు మీడియా & ప్రేక్షకులు దేవరతోపాటుగా విడుదలైన తమిళ చిత్రం “సత్యం సుందరం”ను (Sathyam Sundaram) కూడా ఆదరిస్తుండగా.. తమిళ ప్రేక్షకులు మాత్రం “దేవర” (Devara) కు ఎప్పట్లానే హ్యాండ్ ఇచ్చారు. తమిళ ప్రేక్షకులు తమ భాషా సినిమాలను తప్ప వేరే సినిమాలను చూడరు అన్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని నిరూపిస్తూ దేవర తమిళ వెర్షన్ తొలిరోజు కేవలం 80 లక్షలు మాత్రమే వసూలు చేసింది.
Devara
సినిమాలో తమిళ నటులు ప్రధాన పాత్రల్లో లేకపోవడం ఓ కారణంగా చెబుతున్నప్పటికీ.. తమిళ ప్రేక్షకుల భాషాభిమానమే ముఖ్య కారణం అని వారు ఒప్పుకొని పచ్చి నిజం. మరోపక్క కార్తీ (Karthi) “సత్యం సుందరం” తెలుగు వెర్షన్ కు మంచి రేటింగులు వచ్చాయి, తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలాంటి ఈగో లేకుండా సంతోషంగా నెత్తినపెట్టుకున్నారు. మొదటి రోజే 80 లక్షలు అంటే, ఓవరాల్ తమిళ వెర్షన్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు ట్రేడ్ పండిట్స్.
“దేవర” తమిళ వెర్షన్ రైట్స్ 7.5 కోట్లకు కొనుక్కున్నారు. తమిళ వెర్షన్ బ్రేక్ ఈవెన్ రావాలంటే 18 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాలి. మరి దేవర ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అచీవ్ చేయగలుగుతుందో లేదో చూడాలి. ఇకపోతే.. దేవర తెలుగు వెర్షన్ మాత్రం నాన్ రాజమౌళి (S. S. Rajamouli) రికార్డ్ సృష్టించింది. తొలిరోజు 172 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది అంటూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం విశేషం.
ఎన్టీఆర్ కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన “దేవర” ఆయన కెరీర్ లో మోస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ గా మారనుంది. సినిమా రివ్యూల విషయంలో కాస్త ఢీలాపడిన కొరటాల కలెక్షన్స్ విషయంలో మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.