అసలు విడుదలవ్వదు అనుకొన్న “ట్యాక్సీవాలా”తోనే సూపర్ హిట్ అందుకొని తన కెరీర్ కి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ను దక్కించుకొన్న హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. అయితే.. ఆ సినిమా సూపర్ సక్సెస్ ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ సినిమా విడుదలై ఆల్రెడీ నాలుగు నెలలవుతుంది. ఆ సినిమాను టీవీలో కూడా వేసేశారు. కానీ ఇప్పటివరకు మరో సినిమా సైన్ చేయలేదు. దాంతో అమ్మడి కెరీర్ ఇప్పుడప్పుడే ఊపందుకోవడం కష్టమని జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు. అందుకే అర్జెంట్ గా ఒక సూపర్ హాట్ ఫోటోషూట్ చేయించుకొని మీడియాకి వదిలింది ప్రియాంక. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో మాత్రమే కాక కుర్రాళ్ళ గుండెల్లోనూ హల్ చల్ చేస్తున్నాయి.
ప్రియాంక జవాల్కర్ కి ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశం లేకపోయినా.. కన్నడ, తమిళ ఇండస్ట్రీస్ నుంచి మాత్రం మంచి ఆఫర్లే ఉన్నాయి. రానున్న రెండు నెలల్లో అమ్మడు ఏదో ఒక సినిమా సైన్ చేయడం ఖాయం. మరి ఈలోపు ఈ కొత్త ఫోటోషూట్ చూసిన మన తెలుగు దర్శకనిర్మాతలు, యువ హీరోలు ప్రియాంకను తమ సినిమా కోసం పరిశీలిస్తారేమో చూడాలి