ఇండస్ట్రీలో ఎలాంటి హేటర్స్ కానీ.. ఏ ఒక్క హీరోతో గొడవలు కానీ లేకుండా చాలా పాజిటివ్ గా ఉండే ప్రభాస్ మీద ఉన్నట్లుండి తెలంగాణ ప్రభుత్వం గుస్సా అయ్యింది. అది కూడా ఏ రేంజ్ లో అంటే.. ఏకంగా ప్రభాస్ గెస్ట్ హౌజ్ ను సీజ్ చేసేంత. రాయదుర్గం పరిసరాల్లోని ప్రభాస్ అతిధి గృహాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేయడం సంచలనంగా మారింది.రాయ దుర్గం గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టు కేసు నడుస్తోంది. దీని పై కోర్టు తీర్పు వెలువడి పరిష్కారం లభించడంతో శేరిలింగంపల్లి తహశీల్దారు వాసుచంద్ర ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు.
ప్రభాస్ అదృష్టం బాలేక ఆ స్థలంలోనే ఆయన గెస్ట్ హౌజ్ ఉంది. దాంతో ఆ స్థలంతోపాటు ప్రభాస్ హౌజ్ కూడా సీజ్ అయ్యింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఆ గేస్ట్ హౌజ్ ను ఎలా విడిపించుకుంటాడు అనే విషయం మీదే అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం “సాహో” మరియు రాధాకృష్ణ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ ఇష్యూని ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి.