Hero Vijay: వామ్మో.. కోలీవుడ్ హీరో విజయ్ రెమ్యునరేషన్ అన్ని రూ.కోట్లా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఊహించని రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్న విజయ్ ప్రస్తుతం వారసుడు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ ఏకంగా 105 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు. భవిష్యత్తు సినిమాలకు విజయ్ ఒక్కో ప్రాజెక్ట్ కు 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఈ రెమ్యునరేషన్ రజనీకాంత్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువ మొత్తమని సమాచారం. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

వారసుడు సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో విజయ్ మార్కెట్ మరింత పెరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. విజయ్ తర్వాత ప్రాజెక్ట్ కు లోకేశ్ కనగరాజ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారని సమాచారం అందుతోంది. ఈ సినిమాతో పాటు విజయ్ అట్లీ డైరెక్షన్ లో కూడా నటిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ మొదలుకానుందని తెలుస్తోంది. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో విజయ్ అట్లీ కాంబో మూవీ తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సన్ పిక్చర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయలు అంటే ఆ మొత్తం ఎక్కువ మొత్తమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ సినిమాలు ఇదే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సి ఉంది. భారీ రెమ్యునరేషన్ తీసుకుని సినిమాలు సక్సెస్ సాధించకపోయినా విజయ్ కెరీర్ పై ప్రభావం పడుతుంది. రాబోయే రోజుల్లో విజయ్ రెమ్యునరేషన్ విషయంలో ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

సౌత్ ఇండియాలోనే ప్రస్తుతం విజయ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తల గురించి విజయ్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాల్సి ఉంది. విజయ్ సినిమాలకు డైరెక్షన్ చేయడానికి పలువురు టాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. వారసుడు సినిమాతో తెలుగులో విజయ్ కు ఏ స్థాయిలో మార్కెట్ పెరుగుతుందో చూడాలి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus