కొన్నేళ్ల క్రితం వరకు పెద్ద హీరోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ పేరు మారుమ్రోగింది. థమన్ కొన్నేళ్ల పాటు దేవిశ్రీ ప్రసాద్ కు గట్టి పోటీ ఇచ్చినా రొటీన్ మ్యూజిక్ ఇస్తున్నాడని విమర్శలు వ్యక్తం కావడంతో పాటు కొన్నిసార్లు బిజీఎం విషయంలో కూడా నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. తర్వాత కాలంలో థమన్ కు సినిమా ఆఫర్లు కూడా తగ్గాయి. అయితే త్రివిక్రమ్ సినిమాలకు మ్యూజిక్ అందించడం ద్వారా థమన్ మళ్లీ వార్తల్లో నిలిచారు.
అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలకు థమన్ ఇచ్చిన మ్యూజిక్, బీజీఎంకు మంచి మార్కులు పడ్డాయి. గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అఖండ సినిమా సక్సెస్ విషయంలో థమన్ మ్యూజిక్, బీజీఎం కీలక పాత్ర పోషించింది. అఖండ సినిమాకు థమన్ కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇచ్చి ఉంటే ఆ స్థాయిలో సినిమా సక్సెస్ సాధించేది కాదు. ఈ నెలలో డీజే టిల్లు, భీమ్లా నాయక్ సినిమాలతో థమన్ రెండు విజయాలను ఖాతాలో వేసుకున్నారు.
డీజే టిల్లుకు థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగా భీమ్లా నాయక్ సినిమాకు మాత్రం మ్యూజిక్ తో పాటు బీజీఎం ఇచ్చారు. భీమ్లా నాయక్ పాటలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అంత ఇష్టమేందయ్యా సాంగ్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే సినిమాలో ఈ పాట లేకపోవడం గురించి థమన్ స్పందించారు. వేడి మీద ఉండే స్టవ్ పై నీళ్లు పోస్తే బాగుండదని ఈ పాట గురించి థమన్ అన్నారు.
సినిమాలో అంత ఇష్టమేందయ్యా పాట ఉంటే సినిమా ఫ్లో మిస్ అవుతుందని ఆ పాటను తీసేసినట్లు థమన్ చెప్పకనేచెప్పేశారు. 110 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుంటుందని చెప్పవచ్చు.