Thaman, Mahesh Babu: ఆ సినిమాలను మించి సర్కారు ఉంటుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ప్రిన్స్ మహేష్ బాబు గుర్తింపును సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాటపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు ట్యూన్స్ ఇచ్చారని తెలుస్తోంది. థమన్ ఈ సినిమాకు సంబంధించి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దీపావళికి ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

మోస్ట్ అవైటెడ్ ఆల్బమ్ అయిన సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా థమన్ సర్కారు వారి పాట హ్యాష్ ట్యాగ్ లను షేర్ చేస్తూ “డ్రమ్మింగ్, హమ్మింగ్, కుమ్మింగ్” అంటూ సినిమాపై హైప్ పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫస్ట్ సాంగ్ గా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

మహేష్ థమన్ కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థమన్ సర్కారు వారి పాట సినిమాతో పాటు భీమ్లా నాయక్, మరికొన్ని సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ స్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో కళావతి అనే పాత్రలో కనిపించనున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus