నితిన్ (Nithiin) హీరోగా రూపొందిన ‘తమ్ముడు’ (Thammudu) కూడా రిలీజ్ డేట్ కోసం చాలా స్ట్రగుల్ అయ్యింది. దిల్ రాజు (Dil Raju) వంటి బడా నిర్మాత రూపొందించిన సినిమా అయినప్పటికీ.. రిలీజ్ కష్టాలు ఎదుర్కొంది. ఫిబ్రవరి 17, మే 9, జూలై 4, జూలై 24(రూమర్డ్ డేట్) అంటూ ఇప్పటికే 4,5 సార్లు వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) , విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ‘కింగ్డమ్’ (Kingdom) సినిమాల వల్ల ‘తమ్ముడు’ రిలీజ్ డేట్లు మారుతూ వచ్చాయి.
ఎట్టకేలకు ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ ‘కింగ్డమ్’ సినిమాల రిలీజ్..లు జూలై 4కి రావడం కష్టం అని తేలడంతో… ‘తమ్ముడు’ ని జూలై 4కే తెస్తున్నారు. ఇలా రిలీజ్ డేట్ విషయంలో ఇప్పుడు ‘తమ్ముడు’ కి ఓ క్లారిటీ వచ్చింది. సినిమా కూడా కంప్లీట్ అయ్యింది. కాబట్టి ప్రమోషన్స్ డోస్ కూడా పెంచాలి. జూన్ 11న టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ మాత్రం డోస్ సరిపోదు. ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమా కోసం నితిన్ నెల రోజుల ముందు నుండి ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.
దాని ఫలితం సంగతి ఎలా ఉన్నా.. అలాంటి ప్రమోషన్ ‘తమ్ముడు’ కి అవసరం. ఎందుకంటే ‘భీష్మ’ (Bheeshma) తర్వాత నితిన్ కి హిట్టు లేదు. మరోపక్క దిల్ రాజు జడ్జిమెంట్ పై కూడా నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. మరోపక్క ‘తమ్ముడు’ కి ఎలాంటి హైప్ లేదు. కాబట్టి ప్రమోషన్ డోస్ పెంచకపోతే మొదటి రోజు టాక్ బాగున్నా.. సరైన ఓపెనింగ్స్ రావడం కష్టమైపోతుంది.