ఈ మధ్య చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హీరోలంతా పాన్ ఇండియా సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందరూ తమ మార్కెట్ పెంచుకోవడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నారు. అందుకోసం పెద్ద స్పాన్ ఉన్న కథలు ఎంపిక చేసుకుంటున్నారు. అందులో కూడా ఎక్కువగా ఫాంటసీ టచ్ ఉన్న కథలు, చారిత్రాత్మక కథలకి ఓటేస్తున్నారు. దీని వల్ల సినిమాల మేకింగ్ కి ఎక్కువ టైం పడుతుంది. బడ్జెట్లు కూడా పెరుగుతున్నాయి.
ముఖ్యంగా వి.ఎఫ్.ఎక్స్ అనేది పెద్ద సమస్యగా మారింది. దీని వల్ల సినిమాలు అనుకున్న టైంకి రావడం లేదు. వి.ఎఫ్.ఎక్స్ కంపెనీలు ఔట్పుట్ ఇవ్వాలి. అది చూసి నచ్చితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు. లేదు అంటే మళ్ళీ కరెక్షన్స్ కోసం మళ్ళీ వి.ఎక్స్.కంపెనీ వాళ్ళకి పంపుతున్నారు. ప్రభాస్ (Prabhas) ‘ది రాజాసాబ్'(The Raja saab), చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara), మంచు విష్ణు (Manchu Vishnu) ‘కన్నప్ప’ (Kannappa) వంటి సినిమాలు ఈ సమస్యతో రిలీజ్ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ లిస్టులోకి ‘అఖండ 2’ (Akhanda 2) కూడా వచ్చి చేరనుందా అనే చర్చలు ఇప్పుడు ఊపందుకున్నాయి.
ఎందుకంటే నిన్న ‘అఖండ 2’ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో మాస్ అప్పీల్ నిండుగా ఉంది. కానీ వి.ఎఫ్.ఎక్స్ తేడా కొట్టింది. ఇది డివోషనల్ టచ్ ఉన్న మాస్ సబ్జెక్ట్. కాబట్టి వి.ఎఫ్.ఎక్స్ అవసరం ఉంటుంది. దర్శకుడు బోయపాటి శ్రీనుకి (Boyapati Srinu) దీని గురించి అవగాహన తక్కువ. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు అని నిర్మాతలు, హీరో డిసైడ్ అయితే.. సెప్టెంబర్ 25 కి ‘అఖండ 2’ రావడం కష్టమే.