అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ‘తండేల్’ (Thandel) సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు కావస్తోంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం వల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దర్శకుడు చందూ మొండేటి నాగ చైతన్యని ప్రజెంట్ చేసిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది.దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన సాంగ్స్ కూడా మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చాయి.
Thandel Collections:
ఒక్క ఓవర్సీస్ లో తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లో ఈ సినిమా బాగా కలెక్ట్ చేస్తుంది.ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘తండేల్’ చిత్రానికి రూ.35.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.40.96 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.4.96 కోట్ల ప్రాఫిట్స్ తో క్లీన్ హిట్ గా నిలిచింది. గ్రాస్ పరంగా రూ.71 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా.