తరుణ్ భాస్కర్.. టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరు.తన మొదటి సినిమా ‘పెళ్ళిచూపులు’ తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. కానీ రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ మాత్రం సో సోగా ఆడింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ లో కంటే కూడా రీ రిలీజ్లో బాగా ఆడింది అని చెప్పొచ్చు. అయితే తన మూడో సినిమాకి చాలా గ్యాప్ తీసుకున్నాడు తరుణ్ భాస్కర్. లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల అందరి దర్శకులకి గ్యాప్ వచ్చింది కాబట్టి..
దానిని అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు. కాకపోతే తరుణ్ తో సినిమాలు చేసిన విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లు ఇప్పుడు స్టార్స్ గా ఎదిగారు. నటుడిగా విశ్వక్ సేన్ తో సినిమాలు చేశాడు తరుణ్ భాస్కర్.. కానీ దర్శకుడిగా అతనితో ఎప్పుడు సినిమా చేస్తాడు అన్నది క్లారిటీ ఇవ్వలేదు. కొందరు అభిమానులైతే, విజయ్ దేవరకొండ – విశ్వక్ సేన్..లతో ఓ క్రేజీ మల్టీస్టారర్ చేయాలని దర్శకుడు తరుణ్ భాస్కర్ ను రిక్వెస్ట్ చేయడం జరిగింది.
అందుకు (Tharun Bhascker) తరుణ్ భాస్కర్.. ‘ఇప్పుడు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు.ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు. ఇక ప్రేక్షకులైతే ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ కూడా అడుగుతున్నారు. నాకైతే ‘పెళ్ళిచూపులు’ సినిమాలో ప్రశాంత్(విజయ్ దేవరకొండ) పాత్రని ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాలో కౌశిక పాత్రని.. రిఫెరెన్సులుగా తీసుకుని.. ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలని ఉంది. అది మల్టివర్స్ అని చెప్పలేను కానీ.. అలాంటి కోరిక మాత్రం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.