Tharun Bhascker: విజయ్ వైల్డ్ కార్డ్ లాంటోడు… అప్పుడే అతన్ని వాడుతా?

విజయ్ దేవరకొండ రీతువర్మ జంటగా తెరకెక్కిన పెళ్లిచూపులు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. అప్పటికే తరుణ్ భాస్కర్ పలు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీ లో బిజీగా ఉన్నటువంటి తరుణ్ భాస్కర్ తాజాగా అలీ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న అటువంటి ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ సందర్భంగా తెలియజేశారు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఏవేవో కథలు రాస్తూ ఉండేవాడినని ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ వెల్లడించారు. ఇలా కథలు రాస్తూ అవకాశాల కోసం ఇండస్ట్రీ చుట్టూ తిరిగే వాడినని అయితే ఆ సమయంలో తన జేబులో పది రూపాయలు లేకపోయినా తన బుర్రలో మాత్రం వందకోట్ల ఆలోచనలు ఉండేవని ఈ సందర్భంగా తన ఆలోచనల గురించి తరుణ్ భాస్కర్ వెల్లడించారు.

ఇక విజయ్ దేవరకొండ తనకు ఏ విధంగా పరిచయమయ్యారనే విషయాల గురించి కూడా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. విజయ్ దేవరకొండ నాది ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అని.. విజయ్ దేవరకొండ గల్లీలో థియేటర్ ఆర్టిస్టులాగా తిరుగుతూ ఉండేవాడు,అతనితో పాటు నేను కూడా తిరుగుతూ ఉండేవాడినని ఈ సందర్భంగా తనతో ఉన్న రిలేషన్ గురించి తరుణ్ భాస్కర్ వెల్లడించారు.

ఇకపోతే విజయ్ దేవరకొండతో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా విజయ్ దేవరకొండ తనకు వైల్డ్ కార్డ్ లాంటివాడు. తనకు ఎప్పుడైతే వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు వస్తాయో అప్పుడే తనని వాడుతాను అని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus