‘సరైనోడు’ (Sarrainodu) టైంలో అల్లు అర్జున్ (Allu Arjun) .. పవన్ (Pawan Kalyan) అభిమానులకి టార్గెట్ అయ్యాడు. ఆ టైంలో అతన్ని మెగా ఫ్యామిలీ వెనకేసుకొచ్చింది. దీంతో అల్లు అర్జున్ ఇమేజ్ కి పెద్ద మచ్చ పడలేదు. కానీ కొంతకాలంగా మెగా అభిమానులకు కూడా అల్లు అర్జున్ టార్గెట్ అవుతూ వస్తున్నాడు. మొదట్లో ఇది చిన్నదిగానే కనిపించింది. కానీ ఎప్పుడైతే ఎన్నికల టైంలో నంద్యాల వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి తరఫున ప్రచారం చేసి వచ్చాడో..
Pushpa2 The Rule
అప్పటి నుండి మెగా అభిమానులు సైతం అల్లు అర్జున్ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ‘పుష్ప 2’ (Pushpa2 The Rule) పై కూడా నెగిటివిటి ఏర్పడింది. కానీ ‘పుష్ప’ హైప్ అడ్వాంటేజ్ అవ్వడం.. దానికి అల్లు అర్జున్ ప్రమోషన్స్ కూడా హెల్ప్ అవ్వడంతో ‘పుష్ప 2’ కి హైప్ పెరిగింది. కానీ ‘పుష్ప 2’ చిత్రానికి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకోవాలనే కోరిక అల్లు అర్జున్లోనూ, నిర్మాతలైన మైత్రి వారిలోనూ ఎక్కువగా కనిపించింది.
దీంతో ఆంధ్ర, తెలంగాణ.. ప్రభుత్వాల నుండి పర్మిషన్లు తెచ్చుకుని టికెట్ రేట్లు భారీగా పెంచేశారు. ప్రీమియర్స్ కి కూడా రూ.1200 వరకు టికెట్ రేటు పెట్టడం అనేది సామాన్యులకు ఇబ్బందిగా మారింది. మరోపక్క ‘పుష్ప 2’ ని నిషేధించాలి అంటూ మెగా అభిమాన సంఘాలు డిసైడ్ అవ్వడంతో గోదావరి జిల్లాల్లో ‘పుష్ప 2’ ప్రీమియర్స్ కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగింది.
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో.. సినిమాలో ఉన్న కొన్ని డైలాగులు మెగా అభిమానులకు ఇంకా కోపం తెప్పిస్తున్నాయి. సినిమా స్టార్టింగ్లో అల్లు అర్జున్ ఓ డైలాగ్ పలుకుతాడు. ‘నీకు, నీ బాస్ కి, వాడి కొడుక్కి కూడా నేనే బాస్’ అనే డైలాగ్ చిరంజీవిని (Chiranjeevi) టార్గెట్ చేసినట్లు ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోచోట ‘నువ్వు పావలా వాటా గాడివి కదా’ అనే డైలాగ్, సెకండాఫ్ లో హీరో అన్న కూతుర్ని ఏడిపిస్తున్నారు అని ‘విలన్ గ్యాంగ్ కి చెందిన వ్యక్తికి గుండు కొట్టించి గాడిపై ఊరేగించడం..
తర్వాత ఆ సీన్ గురించి వచ్చే డైలాగులు కూడా మెగా అభిమానులకు ఇబ్బందికరంగా మారాయి అని చెప్పాలి. వీలైతే ఈ డైలాగ్స్ ని డిలీట్ చేస్తే మంచిదని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రిలీజ్ తర్వాత కూడా కొన్ని సినిమాలకి సీన్లు కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ ‘పుష్ప 2’ విషయంలో ఏమైనా సన్నివేశాలు కట్ చేసే ఉద్దేశం దర్సకనిర్మాతలకి ఉంటే ఆ డైలాగులు కట్ చేస్తే మంచిదని కొందరు సూచిస్తున్నారు.