యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టిన మొట్టమొదటి చిత్రం ‘ఛత్రపతి’. ‘సింహాద్రి’ వంటి భారీ సెన్సేషనల్ హిట్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఇది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు,ఎమోషన్స్ మరియు సెంటిమెంట్ సన్నివేశాలు రాజమౌళి కెరీర్ లో ఇప్పటికీ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇద్దరి కెరీర్స్ కి మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది, అలాగే ప్రభాస్ ని పెద్ద మాస్ హీరో రేంజ్ కి ఈ సినిమా తీసుకెళ్లింది కానీ, కలెక్షన్స్ పరంగా మాత్రం వీళ్ళ కెరీర్ హైయెస్ట్ మాత్రం కాలేకపోయింది.
రాజమౌళి ‘సింహాద్రి’ చిత్రానికి పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, కానీ (Chatrapathi) ఛత్రపతి కి కేవలం 14 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చాయి. అలాగే ప్రభాస్ ‘వర్షం’ సినిమా 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టింది. కాబట్టి కలెక్షన్స్ పరంగా ఇది కేవలం మామూలు హిట్ అనే చెప్పాలి. ఇకపోతే ఈ చిత్రం లో ప్రభాస్ కి మరియు విలన్స్ కి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడిచే విధంగా చేస్తుంది.
ప్రభాస్ మరియు కాట్ రాజ్ మధ్య వచ్చే ఫైట్ సన్నివేశం, అలాగే ప్రభాస్ మరియు బాజీ రావ్ మధ్య వచ్చే ఫైట్ సన్నివేశం సినిమాకి ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. అయితే ఈ బాజీ రావ్ పాత్ర కోసం ముందుగా జగపతి బాబు ని అడిగారట. అప్పటికే ఆయన హీరో గా కొనసాగుతున్నాడు. మంచి హిట్స్ కూడా వస్తున్నాయి. అయినా కూడా రాజమౌళి ధైర్యం చేసి అడిగాడట.
కానీ జగపతి బాబు మాత్రం నో అన్నాడట. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజి ఉన్న నన్ను విలన్ గా పెట్టుకుంటే మీ సినిమాకి మైనస్ అవుతుంది అన్నాడట, అప్పట్లో జగపతి బాబు మైండ్ సెట్ అలా ఉండేది. ఇక వేరే ఛాయస్ లేక బాలీవుడ్ నటుడు నరేంద్ర ని తీసుకున్నారు.