Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » The GOAT: ‘ది గోట్‌’లో యంగ్‌ విజయ్‌.. ఆ సినిమా నుండి హెల్ప్‌ తీసుకున్నారట!

The GOAT: ‘ది గోట్‌’లో యంగ్‌ విజయ్‌.. ఆ సినిమా నుండి హెల్ప్‌ తీసుకున్నారట!

  • August 31, 2024 / 10:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The GOAT: ‘ది గోట్‌’లో యంగ్‌ విజయ్‌.. ఆ సినిమా నుండి హెల్ప్‌ తీసుకున్నారట!

టెక్నాలజీ రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. వినియోగంలో ఏమాత్రం తేడాకొట్టినా అసలుకే మోసం వచ్చేస్తుంది. దీనికి లేటెస్ట్‌ ఉదాహరణలు కావాలి అంటే ‘ఆచార్య’ (Aharya) , ‘ఆదిపురుష్‌’ (Adipurush) సినిమాల పేర్లు చెప్పొచ్చు. ఈ రెండు సినిమాల్లో లేటెస్ట్‌ టెక్నాలజీ చాలా జాగ్రత్తగా వాడాం అని చెప్పుకున్న టీమ్‌… విడుదలయ్యాక ట్రోలింగ్‌కి గురైంది. దీంతో తల బొప్పి కట్టింది అని చెప్పాలి. అయితే, ఇప్పుడు ‘ది గోట్‌’ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) (The GOAT) సినిమా టీమ్‌ కూడా ఇలాంటి పరిస్థితికి దగ్గరగా ఉంది.

The GOAT

మొన్నీమధ్య వచ్చిన ఆ సినిమా ట్రైలర్‌ విషయంలో పెదవి విరుపులు చాలానే కనిపిస్తున్నాయి, ట్రోలింగ్‌లు కనిపిస్తున్నాయి, విసుర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ టెక్నాలజీ వినియోగం గురించి సినిమా దర్శకుడు వెంకట్‌ ప్రభు(Venkat Prabhu)   కీలక వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy)  ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది గోట్’ (The Greatest of All Time ) . ‘లియో’  (LEO) తర్వాత విజయ్ నటించిన చిత్రం కావడం, ఆయన త్వరలో రాజకీయాల్లోకి వెళ్లనుండటం తదితర కారణాల వల్ల ఈ సినిమా మీద భారీ హైప్‌ ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!
  • 2 'పుష్ప 2'... చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!
  • 3 నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

ఇద్దరు విజయ్‌లు కనిపించడం, దివంగత విజయ్‌ కాంత్‌ ఏఐ రూపంలో కనిపించనుండటం మరికొన్ని కారణాలు. డీఏజింగ్‌ టెక్నాలజీ ద్వారా విజయ్‌ను ఈ సినిమాలో ఓ పాత్ర కోసం యంగ్‌గా చూపిస్తాం అని ఇప్పటికే టీమ్‌ చెప్పేసింది. ప్రచార చిత్రాల్లో చూపించింది కూడా. ఆ సన్నివేశాల కోసం విజయ్‌ స్పోర్స్ట్ బేస్డ్‌ యాక్షన్‌ మూవీ ‘బిగిల్‌’లోని సన్నివేశాలను తీసుకున్నామని దర్శకుడు వెంకట్‌ ప్రభు చెప్పారు. అయితే ఆ సినిమానే ఎందుకు అనే విషయం మాత్రం చెప్పలేదు.

ఈ నేపథ్యంలో ‘బిగిల్‌’ (Bigil) కాకుండా వేరే పాత సినిమా ఏదైనా తీసుకొని ఉంటే బాగుండేది అనే చర్చ ఇప్పుడు సోషల్‌ మీడియాలో జరుగుతోంది. సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి స్పందనను చూరగొంటుందో చూడాలి.

‘వార్ 2’ స్క్రిప్ట్ లో మార్పులు కోరిన తారక్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The GOAT
  • #The Greatest of All Time
  • #Venkat Prabhu
  • #Vijay Thalapathy

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

18 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

18 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

20 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version