ఇండియా, పాకిస్థాన్.. ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వెయ్యకపోయినా.. పెట్రోల్ పొయ్యకపోయినా కానీ భగ్గుమంటుంది.. ఏ విషయంలోనైనా సరే ఈ శత్రుదేశం వీలైనప్పుడల్లా తన వక్ర బుద్ది బయటపెడుతూనే ఉంటుంది.. ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇక చెప్పక్కర్లేదు.. ఇటీవల జరిగిన టీ 20 మ్యాచ్ గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే, ఇంతలో మరోసారి పాక్ పేరు వార్తల్లో వైరల్ అవుతోంది.. వైరల్ అయ్యేలా వాళ్లకి వాళ్లే ప్రమోట్ చేసుకుంటున్నారు.. న్యూస్ క్రియేట్ చేసుకుంటున్నారు..
టాలీవుడ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్.. తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన ‘ఆర్ఆర్ఆర్’ కంటే తమ సినిమానే గొప్ప అంటూ డప్పు కొట్టుకుంటూ విమర్శల పాలైంది పాకిస్థాన్.. వివరాల్లోకి వెళ్తే.. ఈమధ్య పాక్ నుండి ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ అనే సినిమా వచ్చింది. 45 నుండి 55 కోట్లతో తెరకెక్కినఈ మూవీ వరల్డ్ వైడ్ ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూలు చేసిందట. టాక్ బాగుంది.. ఆడుతుందిలే అనుకుంటే ఈ సినిమా మేకర్స్ మరో స్టెప్ ముందుకేసి ఏకంగా ట్రిపులార్ రికార్డుకే ఎసరు పెట్టారు..
యూకే బాక్సాఫీస్ బరిలో ఇండియన్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ ని మా ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ బీట్ చేసిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అది కూడా కేవలం 17 రోజుల్లోనే ట్రిపులార్ లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ని క్రాస్ చేసేసింది అని హంగామా చేస్తున్నారు. ట్రిపులార్ యూకేలో వంద కోట్లు రాబట్టింది.. మరి దీన్ని బీట్ చేసుంటే.. పాక్ నిర్మాణ సంస్థ తమ సినిమా కలెక్షన్లను ప్రకటించాలి కదా.. ఆ పని చెయ్యలేదు.. మరి ఏ రకంగా ట్రిపులార్ మూవీని వాళ్ల సినిమా బీట్ చేసిందో వాళ్లకే తెలియాలి..
పైగా అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తున్నారు. ఇదంతా ఓపిగ్గా చూసీ, చూసీ మన ఇండియన్ ట్రేడ్ వర్గాల వారికి, మూవీ లవర్స్ అండ్ ఆడియన్స్‌కి చిరాకొచ్చేసింది.. ‘‘ఇదంతా పాక్ ఫేక్ మార్కెటింగ్ ట్రిక్.. క్రికెట్‌లోనే అనుకున్నాం.. ఇప్పుడు సినిమా ఫీల్డ్‌లోనూ అబద్ధాలాడుతూ వంకర బుద్ధి చూపిస్తున్నారు.. మీ సినిమా హిట్ అయితే హంగామా చెయ్యండి కానీ అవతలి వాళ్లని కించపరిచేలా అతి చేయకండి’’ అంటూ ఫైర్ అవుతున్నారు.