ఈ ఏడాది ఇండియా నుండి ఆస్కార్ అందుకున్న వారి ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ ఫీవర్ కంటిన్యూ అవుతూనే ఉంది.. 2023 ఆస్కార్ వేడుక ప్రారంభంలోనే ‘బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అకాడమీ అవార్డ్ గెలుచుకుంది.. ఏనుగులు, వాటితో మనిషికున్న అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అవార్డు సాధించడం విశేషం.. ఓ అనాథ ఏనుగు పిల్ల, దానిని ఆదరించిన దంపతుల కథతో సుమారు 42 నిమిషాల పాటు ఈ సినిమా ఉంటుంది..
దీని కోసం 450 గంటలకు పైగా ఫుటేజ్ క్యాప్చర్ చేయడం అంటే చిన్న విషయం కాదు.. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ షార్ట్ ఫిలిం.. ఆస్కార్స్‌లో కూడా సత్తా చాటింది.. కార్తికి గొన్సాల్వేస్ దర్శకురాలిగా పరిచయం కాగా.. గునీత్ మోంగా నిర్మించారు.. ఇక ఇండియా వచ్చిన తర్వాత నిర్మాత ఆస్కార్ వేదిక మీద తనను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. సన్నిహితులతో తన ఆనందాన్ని పంచుకుంటున్నారు..
ఇటీవల దర్శకురాలు కార్తికిని తమిళనాడు సీఎం స్టాలిన్ సత్కరించి.. రూ. 1 కోటి రూపాయల చెక్కుని ఆమెకు అందజేశారు.. ఇదిలా ఉంటే తాజాగా కార్తికి ఈ ఆస్కార్ అవార్డుని చిత్రంలోని ప్రధాన పాత్రధారులకు చూపించారు.. తమ కష్టానికి ప్రతి ఫలంగా ప్రపంచవ్యాప్తంగా దక్కిన ఆదరణ ఇదేనంటూ ఆమె అవార్డుని రఘు, అమ్మన్ (బొమ్మన్ – బెల్లీ) కు ఇచ్చారు.. ఇక వారిద్దరూ ఈ ప్రతిష్టాత్మక అవార్డుని చేతుల్లోకి తీసుకుని సంతోషంతో మురిసిపోయారు..
వారికి ఆస్కార్ గురించి అంతగా తెలియకపోయినా.. కల్మషం లేని స్వచ్ఛమైన తమ చిరునవ్వు వెలుగుల్లో ఆస్కార్ సైతం మెరిసిపోయేలా చేశారు.. ‘ఫేవరెట్ ఆస్కార్స్ పిక్చర్’ అంటూ నేషనల్ మీడియా కూడా వీరి ఫోటోలతో ఆర్టికల్స్ రాసింది.. దర్శకురాలు కార్తికి, నిర్మాతతో సహా పలువురు సెలబ్రిటీలు ఈ అపురూపమైన ఫోటోను ప్రశంసిస్తున్నారు.. టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కూడా ఈ పిక్ షేర్ చేయడం విశేషం..