The Family Star Collections: ‘ఫ్యామిలీ స్టార్’.. 12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
- April 17, 2024 / 08:07 PM ISTByFilmy Focus
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా పరశురామ్( బుజ్జి) (Parasuram) దర్శకత్వంలో ‘గీత గోవిందం’ (Geetha Govindam) తర్వాత రూపొందిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్'(The Family Star). మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దిల్ రాజు (Dil Raju) నిర్మాత. టీజర్ ట్రైలర్స్ ప్రేక్షకులను అలరించాయి. దీంతో మొదటి నుండి సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. కానీ ఏప్రిల్ 5న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.దీంతో సో సో ఓపెనింగ్స్ మాత్రమే నమోదయ్యాయి.

వీక్ డేస్ లో సెలవులు వచ్చినప్పటికీ పెద్దగా రాణించింది అంటూ ఏమీ లేదు. రెండో వీకెండ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఒకసారి 12 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 5.74 cr |
| సీడెడ్ | 1.07 cr |
| ఉత్తరాంధ్ర | 1.27 cr |
| ఈస్ట్ | 0.69 cr |
| వెస్ట్ | 0.56 cr |
| గుంటూరు | 0.72 cr |
| కృష్ణా | 0.66 cr |
| నెల్లూరు | 0.52 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 11.23 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.30 cr |
| ఓవర్సీస్ | 4.93 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 17.46 cr (షేర్) |
‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకు రూ.41.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.41.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.17.46 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.24.04 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.















