మహిస్మతి రాజ్యంలో వర్షం
- June 21, 2016 / 01:42 PM ISTByFilmy Focus
అమరేంద్ర బాహుబలి రాజ్యం మహిస్మతిలో వర్షం కురిసింది. అక్కడి ప్రజలందరూ పండగ చేసుకున్నారు. మహిస్మతి రాజ్యం ఏమిటి ? అక్కడ వర్షం కురవడం ఏమిటి? అని ఆక్చర్యపోతున్నారా..!!!. అసలు ఏమి జరిగిందో చదవండి. జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి వెండి తెరపై సృష్టించిన రాజ్యం మహిస్మతి. బాహుబలి చిత్రం ద్వారా సినీ అభిమానులందరికి పరిచయమైంది.
ఈ రాజ్యం లో సింహాసనం కోసం అన్నదమ్ములు ఎలా శత్రువులుగా మారారు అనే విషయాన్ని బాహుబలి – ది కంక్లూజన్ ద్వారా దర్శకుడు వివరించనున్నారు. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీ లో వేసిన భారీ మహిస్మతి రాజ్యం ఓపెన్ సెట్ లో క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. గత సోమవారం నుంచి షూటింగ్ జరుగుతోంది.
ఈ సెట్ లో లో తొలి సారిగా నేడు (మంగళ వారం) వర్షం పడింది. దీంతో చిత్ర బృందం షూటింగ్ కి కాస్త విరామం ఇఛ్చి ఎంజాయ్ చేస్తోంది. సెట్ లో వాన పడుతున్న దృశ్యాన్ని రాజమౌళి సినిమా టెక్ లో తీసి ట్విట్టర్ లో ఉంచారు. ఇందుకు నెటిజనులు విశేషంగా స్పందిస్తూ రీ పోస్ట్ చేశారు. మీరు ఆ వీడియోని ఓ సారి చూసేయండి.
The first rains arrive in Mahishmathi…. pic.twitter.com/NLjWCcj5hv
— rajamouli ss (@ssrajamouli) June 21, 2016















