సినిమా ఇండస్ట్రీలో కొందరు నటీమణులు వేధింపులకు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయాలను బహిరంగంగానే బయటపెట్టారు. దీనిపై మీటూ ఉద్యమం కూడా జరిగింది. ఇప్పటికే చాలా మంది నటీమణులు తమ జీవితంలో ఎదురైన ఘటనల గురించి మీడియాకు చెబుతూ.. ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఓ మహిళా దర్శకురాలిపై నటుడు వేధింపుల కేసు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన మలయాళీ సినిమా ఇండస్ట్రీలో చోటుచేసుకుంది.
ఇది లైంగిక వేధింపుల కేసు కాదు కానీ.. బలవంతంగా రొమాంటిక్ సన్నివేశాలలో నటించమని నటుడిని వేధించడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన లక్ష్మీ దీప్త ఇప్పుడిప్పుడే దర్శకురాలిగా నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఆమె ఒక సినిమాలో హీరో రోల్ కోసం ఆడిషన్స్ నిర్వహించింది. ఈ క్రమంలో తిరువనంతపురానికి చెందిన వ్యక్తిని హీరోగా ఎంపిక చేసింది.
షూటింగ్ మొదలైన తరువాత శృంగార సన్నివేశాలలో నటించాలని బలవంతం చేయడంతో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు కేసు ఫైల్ చేయకపోవడంతో కేరళ హైకోర్టుని ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు లక్ష్మీ దీప్తపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.ప్రస్తుతం ఆమె బెయిల్ పై బయటకొచ్చింది. ఈ న్యూస్ మలయాళీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక మహిళా దర్శకురాలిపై ఇలాంటి వేధింపుల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.