ప్రముఖ బిజినెస్ మెన్, కోట్లకు అధిపతి అయిన అరుళ్ శరవణన్ 51 ఏళ్ళ వయసులో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ‘ది లెజెండ్’ అనే పాన్-ఇండియా చిత్రంతో అతను హీరోగా పరిచయమయ్యాడు. ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో.. వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్ వంటి స్టార్లు నటించారు. జూలై 28న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తనే నిర్మించుకున్నాడు శరవణన్.
‘శ్రీ లక్ష్మీ మూవీస్’ సంస్థ పై తిరుపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. మొదటి నుండి అరుళ్ శరవణన్ లుక్స్ పై చాలా ట్రోలింగ్ జరిగింది.దీంతో ఈ సినిమా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇక సినిమాకి ఎలాగూ నెగిటివ్ టాక్ వస్తుంది అని అంతా ముందే ఊహించారు. అందుకు తగ్గట్టే నెగిటివ్ టాక్ వచ్చింది.మొదటి వీకెండ్ ఈ మూవీ క్యాష్ చేసుకోలేకపోయింది. వీక్ డేస్ లో చాలా వరకు చేతులెత్తేసింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
0.14 cr
సీడెడ్
0.08 cr
ఆంధ్ర (టోటల్)
0.10 cr
ఏపీ + తెలంగాణ
0.32 cr
తమిళనాడు
6.00 cr
కేరళ
0.17 cr
కర్ణాటక
0.20 cr
బాలీవుడ్
0.15 cr
ఓవర్సీస్
0.35 cr
వరల్డ్ వైడ్(టోటల్)
7.19 cr
‘ది లెజెండ్’ చిత్రం ఫస్ట్ వీక్ కి గాను వరల్డ్ వైడ్ గా రూ.7.19 కోట్లు కలెక్ట్ చేసింది.ఈ సినిమాని అడ్వాన్స్ బేసిస్ మీదే విడుదల చేశారు. కాబట్టి పెట్టిన రూ.80 కోట్ల బడ్జెట్ రికవరీ చేయాలి.నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరగలేదని వినికిడి. తమిళ నాడు లో అయితే శరవణన్ స్టోర్స్ లో షాపింగ్ చేసిన జనాలకు ‘ది లెజెండ్’ టికెట్ రేట్లు మరియు స్నాక్స్ కూపన్స్ తో తక్కువ రేట్లకు బహుమతిగా ఇస్తున్నారట.
అయినప్పటికీ ఈ సినిమా ఇంకా 10 శాతం కూడా రికవరీ సాధించలేదు. ఈ శరవణన్ ఇంత బడ్జెట్ పెట్టి తీసింది తన షాపింగ్ మాల్స్ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం కోసం అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి.