NTR Watch Cost: ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ ఎంతంటే..?

కొద్ది రోజులుగా ‘ఆర్ఆర్ఆర్’ టీం.. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీస్‌తో సహా ఆస్కార్ సాధించడమే లక్ష్యంగా లాస్ ఏంజెల్స్‌లో ప్రమోషన్స్, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. మధ్యలో చరణ్ – తారక్ హైదరాబాద్ వచ్చి వెళ్లారు కానీ జక్కన్న, కార్తికేయ అక్కడే ఉండిపోయి అన్ని పనులూ చక్కబెట్టారు.. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది.. తెలుగు సినిమాకి కలగానే మిగిలిపోయిన అకాడమీ అవార్డు ‘నాటు నాటు’ పాటతో సాకారమైంది..

ఇక హీరోలు రామ్ – భీమ్ కూడా అక్కడి మీడియాతో, అభిమానులతో, సినీ ప్రముఖులతో ఇంటరాక్ట్ అయ్యారు.. పలు టీవీ షోలలోనూ పాల్గొన్నారు.. వారిచేత ఎంత వరకు చేయించాలో అంత ప్రమెషనూ చేయించారు.. చరణ్ – తారక్ ఇద్దరూ కూడా స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోయారు.. ఆస్కార్స్ కోసమే వారు ప్రత్యేకంగా డ్రెస్సెస్ డిజైన్ చేయించుకున్నట్టున్నారు.. ఇద్దరూ కూడా లాస్ ఏంజెల్స్‌లో పలు ప్రమోషన్లలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అదరగొట్టేశారు..

నెవర్ బిఫోర్ అనేలా కనిపించి ఫ్యాన్స్, ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక తారక్ ఇంగ్లీష్ మాడ్యులేషన్ అయితే అందర్నీ ఆశ్చర్యపరచింది. ఇక ప్రియాంక చోప్రా ఇచ్చిన ప్రీ ఆస్కార్స్ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ సూట్‌లో కనిపించి ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చాడు.. తారక్ సూపర్బ్ డ్రెస్సింగ్‌తో పాటు చేతికి పెట్టుకున్న వాచ్ కూడా ఆకర్షణీయంగా ఉంది.. దీంతో తమ ఫేవరెట్ యాక్టర్ వాచ్ కాస్ట్ గురించి ఫ్యాన్స్ నెట్టింట తెగ సెర్చ్ చేశారు.. తీరా ఆ వాచ్ ధర తెలిసి షాక్ అవుతున్నారు..

యంగ్ టైగర్ పెట్టుకున్న చేతి గడియారం Patek Phillipe Nautilus Travel Time (95990/1A-001 Stainless Steel) – దీని ధర అక్షరాలా రూ. 1 కోటి 56 లక్షల 13,155.. (190,000 డాలర్స్) ఇంత రేటు అంటే ఇక అందులో ఉండే ఫీచర్స్, టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ప్రస్తుతం తారక్ వాచ్ గురించిన వివరాలు వైరల్ అవుతున్నాయి..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus