సూపర్ స్టార్ రజినీ కాంత్ పెద్ద కుమార్తె ఐశ్యర్య ఇంట్లో ఇటీవల భారీ చోరీ జరిగింది.. దీని గురించి ఆమె చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. పెద్ద మొత్తంలో వజ్రాలు, నగలు దొంగిలించారనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.. తమిళ్, తెలుగు ఇండస్ట్రీ వర్గాల వారిలో దీని గురించే చర్చలు జరుగుతున్నాయి.. తన ఇంటి లాకర్‌లో ఉన్న లక్షలాది రూపాయల విలువైన నగలు, డైమండ్ ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఐశ్యర్య.. చెన్నై, తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు ఐశ్యర్య…..
వజ్రాలు, అరమ్ నెక్లెస్‌తో పాటు 60 సవరీల గాజులు కనిపించకుండా పోయాయని, వాటి విలువ లక్షల్లో ఉంటుందని.. తన ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులే అపహరించి ఉంటారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.. 2019లో తన చెల్లెలు సౌందర్య పెళ్లికి ఆ నగలను ఉపయోగించిన తర్వాత వాటిని తన లాకర్‌లో ఉంచినట్లు ఐశ్వర్య తెలిపారు..ఆమె ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నేరస్థులను పట్టుకున్నారు.. ఐశ్వర్య అనుమానమే నిజమైంది.. ఇంటి పనివాళ్లే తిన్నింటి వాసాలు లెక్కపెట్టారు.
నమ్మకంగా ఉంటూ అందినకాడికి అంతా దోచుకున్నారు.. ఐశ్వర్య ఇంట్లో 18 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న ఈశ్వరితో పాటు మరో మహిళ లక్ష్మీ, డ్రైవర్ వెంకటేష్ కలిసి నగలు కాజేశారు.. వీరికి మరో ముగ్గురు సాయం చేశారు.. దొంగిలించిన సొమ్ముతో దర్జాగా చెన్నైలో ఓ ఇళ్లు కొన్నారు.. పలు విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేశారు.. ఐశ్వర్వ ఇంట్లో 100 సవర్ల బంగారం, 30 గ్రాముల వజ్రాభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులతో పాటు కొన్ని పత్రాలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు..
వాటిలో రూ. 4 లక్షల విలువైన డైమండ్ సెట్స్, పురాతన బంగారు ముక్కలు, నవరత్న సెట్స్, గాజులు చోరీకి గురైనట్లు తేలింది.. అంతేకాదు కొంతకాలంగా ఐశ్వర్య ఇంటిలోని విలువైన వస్తువులను కూడా వారు దొంగిలించినట్లుగా పోలీసులు విచారణలో నిర్థారణ అయింది.. ఈ మేరకు నిందితుల్ని అరెస్ట్ చేశారు..