‘కందిరీగ’ చిత్రంతో సాలిడ్ హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చిన రామ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ ‘డార్లింగ్’ వంటి చిత్రాలతో హిట్లు కొట్టి మంచి ఫామ్లో ఉన్న కరుణాకరణ్.. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పైగా రామ్, కరుణాకరణ్ ఇద్దరు కూడా ప్రేమ కథా చిత్రాలకు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లకు కేరాఫ్ అడ్రెస్ అనే బ్రాండ్ కలిగి ఉన్నవాళ్లే..! ఇవి సరిపోవా ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రంపై భారీ అంచనాలు నమోదవ్వడానికి.? ‘శ్రీ స్రవంతి మూవీస్’ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.2012 వ సంవత్సరం జూన్ 8న ఈ చిత్రం విడుదలైంది.ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
టీజర్, ట్రైలర్ లతో పాటు జి.వి.ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించడం.. ‘నీ చూపులే నా ఊపిరి’ అనే పాట సూపర్ హిట్ కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. కానీ ఇవన్నీ మొదటి షో వరకే పరిమితమవుతాయి అని ఎవ్వరూ ఊహించలేదు. ప్రేక్షకులు ఒకటి ఆశించి థియేటర్ కు వెళ్తే.. ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాలో మరొకటి చూపించారు. ‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూడొచ్చు కదా’ అని ఆశించి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. చనిపోకుండానే హీరోయిన్ ఆత్మ..ఆమె శరీరం నుండీ బయట తిరగడం రావడం ఏంటో? అది హీరోకి మాత్రమే కనిపిస్తుండటం ఏంటో? అర్ధం కాక జనాలు జుట్టు పీక్కున్నారు.వాళ్ళు దీనిని డైజెస్ట్ చేసుకోలేకపోయారు.
అంతేకాదు ఫ్లాష్ ఎపిసోడ్ లో రామ్ గెటప్ అస్సలు సూట్ కాలేదు అని ఆయన అభిమానులే పెదవి విరిచారు. థియేటర్లలో ఈ సినిమా చూసిన వాళ్లకు ఇది అస్సలు నచ్చలేదు.. అయితే బుల్లితెర పై చూసిన వాళ్ళు మాత్రం డిఫరెంట్ అటెంప్ట్.. అంటూ మెచ్చుకున్నారు.2005 లో వచ్చిన ‘జస్ట్ లైక్ హెవెన్’ అనే ఇంగ్లీష్ మూవీని ఆధారం చేసుకుని దర్శకుడు కరుణాకరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రమోషన్ల టైం నుండీ ‘ఎందుకంటే ప్రేమంట’ థీమ్ ను జనాలకు పరిచయం చేసుంటే కనుక వాళ్ళు ప్రిపేర్ అయ్యి థియేటర్ కు వెళ్ళే వాళ్ళు. అప్పుడు మరీ ఇంత ప్లాప్ అయ్యేది కాదేమో అని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!