స్టార్ హీరోయిన్ సమంత తనకు సోకిన అరుదైన వ్యాధి గురించి.. దాని ద్వారా తను పడుతున్న ఇబ్బందుల గురించి కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.. తను కొంతకాలంగా మ్యోసిటిస్ (కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం, నడవలేకపోవడం, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కలిగిన వ్యాధి) తో బాధపడుతున్నానని పోస్ట్ చేసింది. జీవితంలో కొన్ని సమస్యలతో పోరాడి బయటపడాలని.. త్వరలోనే రికవర్ అవుతానని చెప్పుకొచ్చింది..
దీంతో ఫ్యాన్స్, సినిమా ఇండస్ట్రీ వారు, నెటిజన్లు సామ్ త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు చేస్తున్నారు. జనరల్‌గా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయాన్నైనా తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.. అలా సామ్ బాధపడుతున్న డిసీస్ గురించి, అసలు ఆ వ్యాధి ఎందుకు, దేని వలన ఎలా వస్తుంది అని ఫ్యాన్స్, ఆడియన్స్ సెర్చ్ చేశారు.. దాని గురించిన వివరాలు రాబట్టారని.. నెట్టింట పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం సామ్‌కి సోకిన ఈ వ్యాధి 30 దాటిన మహిళలకు ఎక్కువగా వస్తుందట..
దీని వల్ల కండరాలు బలహీనంగా మారుతాయని అంటున్నారు. అయితే తగిన చికిత్స తీసుకుంటే మాత్రం త్వరగా కోలుకోవచ్చని తెలుపుతున్నారు. కాగా పిజ్జాలు, బర్గర్‌లు లాంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా కూడా దీని బారిన పడే అవకాశం ఉందని.. మ్యోసిటిస్ వచ్చిన తర్వాత ఈ జంక్ ఫుడ్ పూర్తిగా మానేస్తేనే మంచిదని అంటున్నారు నిపుణులు..సమంత నటించిన పాన్ ఇండియా ఫిలిం ‘యశోద’ నవంబర్ 11న రిలీజ్ కానుంది..
హిస్టారికల్ మూవీ ‘శాకుంతలం’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ‘యశోద’ ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూసిన వాళ్లంతా సమంత పర్ఫార్మెన్స్‌కి పాన్ ఇండియా రేంజ్‌లో పేరొస్తుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సామ్ ఈ సినిమాకి సంబంధించి.. యశోద యాక్షన్ థ్రిల్స్ పేరుతో.. పేరుతో ఓ మేకింగ్ వీడియో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది..
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!