రజినీకాంత్.. రాజకీయాల్లో అడుగుపెట్టే ఆలోచనని వెనక్కి తీసుకున్నట్టు ఇదివరకే ఓ లేఖ ద్వారా స్పష్టంచేశారు. తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. రజినీ నిర్ణయాన్ని గౌరవిస్తూ పలువురు సినీ ప్రముఖులు కూడా ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. మరో స్టార్ హీరో కమల్ హాసన్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రజినీ రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిదని…
అయితే తన పార్టీకి మద్దతు ఇవ్వాలని రజినీని కోరడానికి వెనుకాడనని ఆయన మొహమాటం లేకుండా చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. తాజాగా రజినీ రాజకీయాల్లోకి రావడం లేదని ఈరోజు ఇంతే జూలై 12వ తేదీన అభిమాన సంఘాలతో భేటీ అయ్యి చెప్పుకొచ్చారు.అంతేకాదు ముందుగా స్థాపించిన రజినీ మక్కల్ మండ్రంను కూడా రద్దు చేస్తున్నట్టు స్పష్టంచేశారు. “రాజకీయాల కోసమే మక్కల్ మండ్రంను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే..నేను రాజకీయాల్లో ఉండనప్పుడు అది అనవసరం.
కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా అలాగే నా ఆరోగ్య పరిస్థితి రీత్యా ఇలా చెప్పడం తప్పడం లేదు. నేను ఇప్పటికి నోరు విప్పకపోతే అభిమానులతో పాటు సామాన్య జనాలు కూడా ఏవేవో పుకార్లను నమ్మి ఎదురుచూసే అవకాశం ఉంది. అందుకే దీనిని రద్దు చేస్తున్నాను” అంటూ రజినీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన దృష్టాంతా కమిట్ అయిన సినిమాలు పూర్తిచేయడం పైనే పెట్టినట్టు కూడా తెలియజేసారు.