బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 తెలుగు ఈ నెల 4వ తేదీ నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దగా పాపులారిటీ లేని వాళ్లకు బిగ్ బాస్ షోలో అవకాశం ఇచ్చారని చాలామంది అభిప్రాయం చేస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ సీజన్6 రేటింగ్స్ సైతం ఆశించిన స్థాయిలో లేవు.
బిగ్ బాస్ సీజన్6 ఫస్ట్ ఎపిసోడ్ రేటింగ్ కేవలం 8.86 కావడం గమనార్హం. గత సీజన్ల ఫస్ట్ ఎపిసోడ్ రేటింగ్ లలో కనీసం సగం కూడా బిగ్ బాస్ సీజన్6 ఫస్ట్ ఎపిసోడ్ సాధించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీక్ డేస్ లో బిగ్ బాస్ షో రేటింగ్స్ మరీ దారుణంగా ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు డిజాస్టర్ సీజన్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా రేటింగ్స్ ఇలాగే కొనసాగితే ఈ షో నిర్వాహకులకు భారీగా నష్టాలు తప్పవు.
ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారమైన రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండటం వల్ల కూడా రేటింగ్ ఊహించని స్థాయిలో తగ్గిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. వీక్ డేస్ లో బిగ్ బాస్ షో రాత్రి 10 గంటలకు ప్రసారం కావడం కూడా ఈ షో రేటింగ్ పై ప్రభావం చూపిస్తూ ఉండవచ్చని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బిగ్ బాస్ నిర్వాహకులు రేటింగ్స్ తగ్గిన నేపథ్యంలో ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
ఓటీటీల హవా అంతకంతకూ పెరుగుతుండటం రేటింగ్స్ పై కూడా ప్రభావం చూపుతోంది. ప్రముఖ ఛానెళ్లకు సొంతంగా ఓటీటీలు ఉండటం ఆ ఓటీటీలలో ఎప్పుడైనా రియాలిటీ షోలను చూసే అవకాశం ఉండటంతో చాలామంది టీవీలలో బిగ్ బాస్ షోను చూడటానికి ఆసక్తి చూపించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓటీటీల వల్ల టీవీ ఛానెళ్లకు కూడా భారీగానే నష్టం కలుగుతోందని చెప్పాలి.