Jabardasth Show: జబర్దస్త్ కు కమెడియన్లు దూరం కావడానికి అసలు కారణమిదా?

బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు ప్రసారమవుతున్నా జబర్దస్త్ షో ఎంతో ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. ఈ షో మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ షోకు కమెడియన్లు వరుసగా దూరమవుతున్నారు. మంచి గుర్తింపు ఉన్న కమెడియన్లు ఈ షోకు దూరం అవుతుండటంతో ఈ షో రేటింగ్ పై కూడా ప్రభావం పడుతుండటం గమనార్హం. జబర్దస్త్ షో నిర్వాహకులు కమెడియన్లకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడం లేదని ఆ రీజన్ వల్లే కమెడియన్లు ఇతర షోలపై దృష్టి పెడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇతర షోల నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తూ ఉండటం వల్ల కమెడియన్లు ఇతర షోలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈ విషయంపై జబర్దస్త్ షో నిర్వాహకులు దృష్టి పెట్టాల్సి ఉంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల రేటింగ్స్ ఈ మధ్య కాలంలో ఉహించని రేంజ్ లో తగ్గుతున్నాయి. కొత్త యాంకర్ సౌమ్య ఎంట్రీతో రాబోయే రోజుల్లో ఈ షో రేటింగ్స్ పుంజుకుంటాయేమో చూడాల్సి ఉంది.

జబర్దస్త్ షోకు ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు. జబర్దస్త్ షో రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ షో ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందనే సంగతి తెలిసిందే. జబర్దస్త్ షో స్కిట్లలో కూడా ఈ మధ్య కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయనే సంగతి తెలిసిందే. జబర్దస్త్ కు పోటీగా ఇతర ఛానెళ్లలో ఎన్నో కామెడీ షోలు ప్రసారమైనా ఆ షోలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి.

ఎక్కువ సంవత్సరాలు బుల్లితెరపై ప్రసారమైన షోలలో జబర్దస్త్ షో ఒకటి కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో ఈ షో రేటింగ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus