విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ మూవీ ఫ్లాప్ కావడానికి కారణాలేంటనే ప్రశ్నకు వేర్వేరు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక సినిమా ఫ్లాప్ కావడానికి ఎన్ని కారణాలు ఉంటాయో లైగర్ సినిమా ఫ్లాప్ కావడానికి కూడా అన్నే కారణాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక అస్సలు బాలేదని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లైగర్ మూవీ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాకు
మరో వెర్షన్ లా ఉందే తప్ప కొత్తగా లేదని మరి కొందరు నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూరీ జగన్నాథ్ నుంచి ఆయన అభిమానులు ఏం ఆశిస్తారో ఆ సన్నివేశాలు మాత్రం ఈ సినిమాలో అస్సలు లేవు. కథనం విషయంలో పూరీ జగన్నాథ్ అస్సలు దృష్టి పెట్టలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి కొందరు అయితే ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తీశారా లేక మరో డైరెక్టర్ తీశారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
పూరీ జగన్నాథ్ సినిమాకు ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో విమర్శలు వ్యక్తం కావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఛార్మి ఈ సినిమా ఫలితం గురించి ఇప్పటికే స్పందించినా పూరీ జగన్నాథ్ మాత్రం ఈ సినిమా రిజల్ట్ గురించి అస్సలు స్పందించకపోవడం గమనార్హం. కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో ఈ సినిమా ఫ్లాప్ కు అన్ని కారణాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పూరీ జగన్నాథ్ ఈ సినిమా కోసం భారీ మొత్తంలో ఖర్చైందని చెప్పిన మొత్తానికి ఈ సినిమా నిర్మాణ విలువలకు
ఏ మాత్రం సంబంధం లేదని ఈ సినిమా మ్యూజిక్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం కూడా కష్టమేనని బోగట్టా. కథనం విషయంలో పూరీ జగన్నాథ్ మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా ఫలితం మెరుగ్గా ఉండేదని కొంతమంది చెబుతున్నారు.