Nagarjuna, Krishna: కృష్ణ పార్థివదేహాన్ని చూడటానికి నాగ్ అందుకే రాలేదా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున ఇండస్ట్రీలో ఏ కుటుంబం కష్టాల్లో ఉన్నా హాజరవుతారని పేరుంది. అయితే కృష్ణ పార్థివదేహాన్ని చివరిసారి చూడటానికి కూడా నాగార్జున రాకపోవడం ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగ్ ఈ విధంగా చేయడం కరెక్టేనా అని కొంతమంది అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. కృష్ణ కుటుంబంతో నాగ్ కు మంచి అనుబంధం ఉంది. నాగార్జున కొడుకులు నటించిన పలు సినిమాల ఈవెంట్లకు మహేష్ హాజరైన సందర్భాలు సైతం ఉన్నాయనే సంగతి తెలిసిందే.

కృష్ణతో నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. కృష్ణ నాగార్జున కలిసి పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. బలమైన రీజన్ ఉండటం వల్లే నాగార్జున కృష్ణను కడసారి చూడటానికి రాలేదని నాగ్ ప్రస్తుతం వేరే ప్రాంతంలో ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంలో నాగార్జునను తప్పు పట్టాల్సిన అవసరం లేదని మరి కొందరు చెబుతున్నారు.

కృష్ణ మరణించిన విషయం తెలిసిన వెంటనే నాగార్జున సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. నాగ్ కుటుంబ సభ్యులు కృష్ణకు నివాళులు అర్పించడానికి హాజరయ్యారు. నాగార్జున నటించిన బంగార్రాజు, ది ఘోస్ట్ సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమాలలో బంగార్రాజు హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటే ది ఘోస్ట్ మూవీ కమర్షియల్ గా ఫ్లాప్ గా నిలిచింది.

ది ఘోస్ట్ సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. అయితే థియేటర్లలో డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్న ఈ సినిమా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus