పెదనాన్న కృష్ణంరాజు మరణవార్త ప్రభాస్ ను ఎంతగానో బాధ పెట్టిందనే తెలిసిందే. కృష్ణంరాజు మృతితో ప్రభాస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రభాస్ దర్శకనిర్మాతలకు ఇప్పటికే ఇందుకు సంబంధించి సమాచారం ఇచ్చారని బోగట్టా. సెప్టెంబర్ నెలంతా షూటింగ్ లు క్యాన్సిల్ చేయాలని ఆయన సూచనలు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు అతి త్వరలో ప్రభాస్ ను అమిత్ షా కలవనున్నారని సమాచారం. ఈ నెల 16వ తేదీన అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నారని బోగట్టా.
కృష్ణంరాజు బీజేపీ నేతగానే మరణించిన నేపథ్యంలో కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్ షా కలవడంలో ఆశ్చర్యం లేదు. ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని తెలుస్తోంది. అయితే అమిత్ షా ప్రభాస్ ను కలిస్తే రాజకీయ వర్గాల్లో ప్రభాస్ గురించి కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రభాస్ రాజకీయాలపై దృష్టి పెట్టే ఛాన్స్ మాత్రం లేదు. ప్రస్తుతం సినిమాల పరంగా ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.
ఒక్కో సినిమాకు ప్రభాస్ 100 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. ప్రభాస్ ఏదైనా రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇతర పార్టీల నేతల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు ప్రభాస్ సైతం వివాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రభాస్ సినిమాలన్నీ సక్సెస్ ను సొంతం చేసుకుని నటుడిగా ప్రభాస్ రేంజ్ ను ఊహించని స్థాయిలో పెంచాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.