ఈ ఏడాది విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలలో రాధేశ్యామ్, లైగర్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాయనే సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాలుగా విడుదలైన ఈ సినిమాలు కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేకపోవడం, డైరెక్షన్ లోపాలు ఇతర కారణాల వల్ల ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. ఈ సినిమాలు ఫ్లాప్ కావడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఈ రెండు సినిమాలలోని పాటలు, స్క్రీన్ ప్లే హిందీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించినట్టుగా ఉంటుంది.
హిందీ ఫ్లేవర్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కు అస్సలు నచ్చడం లేదు. ఈ సినిమాలు హిందీ ఆడియన్స్ ను సైతం మెప్పించలేకపోయాయి. బాలీవుడ్ లో లైగర్ సినిమా ఒకరోజు ఆలస్యంగా థియేటర్లలో విడుదలైంది. ఈ విధంగా రిలీజ్ చేయడం వల్ల బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు నష్టాలు తప్పేలా లేవు. టాలీవుడ్ డైరెక్టర్లు హిందీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలను తెరకెక్కిస్తే మాత్రం భారీ షాకులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రాధేశ్యామ్, లైగర్ సినిమాల ఫలితాలతో అయినా మన డైరెక్టర్లు మారాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అన్ని కథలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ చేయడానికి సూట్ కావని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అటు విజయ్ దేవరకొండ కెరీర్ పై, పూరీ జగన్నాథ్ కెరీర్ పై లైగర్ సినిమా ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఫుల్ రన్ లో ఈ సినిమా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
లైగర్ సినిమా నష్టాల భర్తీ బాధ్యత ఎవరిపై పడుతుందో చూడాల్సి ఉంది. అటు విజయ్ దేవరకొండ సైతం ఈ సినిమా విషయంలో రెమ్యునరేషన్ ను వదులుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పవచ్చు. కరణ్ జోహార్ కు కూడా ఈ సినిమా వల్ల భారీ మొత్తంలో నష్టాలు తప్పవు.