టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉండగా చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ 2024 సంవత్సరం జనవరిలో మొదలుకానుంది. గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ దీపావళి కానుకగా రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో రామ్ చరణ్ ఒకరు కాగా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా రామ్ చరణ్, ఎన్టీఆర్ సినీ కెరీర్ లో మెమరబుల్ సినిమా అనే సంగతి తెలిసిందే.
తాజాగా జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్ జరగగా ఈ వేడుకలకు ఆర్.ఆర్.ఆర్ టీం తరపున కీరవాణి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన దేశంలోని జర్మనీ ఎంబసీకి చెందిన సిబ్బంది సైతం హాజరయ్యారు. రామ్ చరణ్ వీడియో కాల్ లో సిబ్బందిని పలకరించడంతో పాటు ఈ వేడుకలకు తాను హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఈ ఈవెంట్ నాటు నాటు పాట కటౌట్ చూసి తనకు సంతోషం కలిగిందని (Ram Charan) రామ్ చరణ్ వీడియో కాల్ లో చెప్పుకొచ్చారు.
అవకాశం ఉన్నప్పుడు ఎంబసీ సిబ్బందిని కలుస్తానని రామ్ చరణ్ మాటిచ్చారు. ఈ ఈవెంట్ లో కీరవాణి జర్మన్ లాంగ్వేజ్ లో పాట పాడి మెప్పించడం గమనార్హం. ఈ ఈవెంట్ లో కీరవాణి మాట్లాడుతూ నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తుందని కలలో కూడా ఊహించలేదని వెల్లడించారు. నాటు నాటు పాటకు మంచి ప్రేక్షకాదరణ దక్కుతుందని భావించానని కీరవాణి పేర్కొన్నారు.
నాటు నాటు సాంగ్ కు వచ్చిన ఆస్కార్ భారతీయ సినిమాకు ఒక ప్రోత్సాహం అని ఇది ఒక గొప్ప శకానికి నాంది అని భావిస్తున్నానని కీరవాణి వెల్లడించారు. కీరవాణి కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.