జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 2024 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడంతో గతంతో పోల్చి చూస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా 11 రోజుల పాటు వారాహి దీక్ష చేస్తున్నట్టు ప్రకటించి ఫ్యాన్స్ ను ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే పవన్ వారాహి దీక్ష చేయడానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం కొనుగోలు చేసిన వాహనం కూడా వారాహి అనే సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దీక్షలో ఉన్న నేపథ్యంలో పండ్లు, పాలు, ద్రవాహారం మాత్రమే ఆయన తీసుకోనున్నారని తెలుస్తోంది. పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉండగా ఆ సప్త మాతృకలలో వారాహి అమ్మవారు ఒకరు. పురాణాలలో వారాహి అమ్మవారు రాక్షసులను సంహరించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ అమ్మవారి గురించి, వారాహి దీక్ష గురించి ఎక్కువమందికి తెలియదు.
వారాహి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు శత్రు భయం ఉండదని లైఫ్ లో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి వారాహి అమ్మవారిని పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ దీక్ష పాటించే వాళ్లు నేలపై పడుకుంటూ అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ దీక్షను ఆచరించాలి. ఈ దీక్ష ఒకింత కఠినమైన దీక్ష అని చెప్పవచ్చు.
డిప్యూటీ సీఎం పవన్ పాలనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని బావించి ఈ దీక్ష చేపట్టారని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. పవన్ నెల రోజుల తర్వాతే షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సెప్టెంబర్ నుంచి సినిమా షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. పవన్ సినిమాలేవీ ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.