బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం ఊహించని ఎలిమినేషన్ అనేది జరిగింది. అందరూ నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఉమాదేవి ఈవారం ఎలిమినేట్ అవ్వాల్సివచ్చింది. 2వ వారం ఉమాదేవి హౌస్ నుంచీ వచ్చేయటం అనేది సీజన్ 4లో కరాటే కళ్యాణిని గుర్తుచేసింది. ఇక ఉమాదేవి వెళ్లిపోవడానికి బలమైన కారణాలు ఏంటి అనేది ఒక్కసారి చూసినట్లయితే..,
1. అన్ అఫీషియల్ పోలింగ్ లో ఓటింగ్ మనం చూసినట్లయితే ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. అనీమాస్టర్, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్. నిజానికి నటరాజ్ మాస్టర్ లీస్ట్ లో ఉన్నారు. కానీ, ఇక్కడే మిస్డ్ కాల్ డేటా అనేది కీలకంగా మారింది బిగ్ బాస్ టీమ్ కి. నిజానికి మా టీవి వాళ్లకి ముంబైకి సంబంధించిన ఒక సంస్థ ఓటింగ్ ఛార్ట్ ని ఇస్తుంది. ఇందులో లీస్ట్ గా ఉన్నవాళ్లు ఎలిమినేట్ అవుతారు ఇది రూల్. .ఇక్కడే ఈక్వల్ పర్సెంటేజ్ లో ఓటింగ్ చేసిన వాళ్ల లిస్ట్ ని కూడా సపరేట్ గా పంపిస్తారు. మిస్డ్ కాల్ డేటాని కూడా సపేరేట్ చేస్తారు. ఇందులో ఉమాదేవి కి తక్కువ ఓట్లు వచ్చి ఉండచ్చు. అందుకే ఎలిమినేట్ అయ్యింది.
2. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉమాదేవి నోరుజారి బూతులు మాట్లాడింది. ఈ విషయంలో కూడా టీమ్ చాలా సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం. అంతేకాదు, బిగ్ బాస్ కి వెళ్లే ముందే అసభ్యపదజాలం వాడకూడదని ముందుగానే హెచ్చరిస్తారు. అలాగే, ఒకరినొకరు కొట్టుకోకూడదని, హింసాత్మకమైన చర్యలు చేయకూడదని చెప్తారు. ఇందులో ఏది అతిక్రమించినా ఉద్వాసన తప్పదు.
3. గేమ్ ని ఎనలైజ్ చేయడంలో ఉమాదేవి ఫెయిల్ అయ్యింది. ఫిజికల్ టాస్క్ ఆడటం అంత ఈజీకాదు. అయినా కూడా ఉమాదేవి ద బెస్ట్ పెర్ఫామెన్స్ ని ఇచ్చింది. కానీ, అందరితో పాటుగా ఎటాకింగ్ మోడ్ లోకి వెళ్లిపోయింది. గేమ్ ని ఎనలైజ్ చేస్తూ ఆడలేకపోయింది. వేరే టీమ్ వాళ్లు ఎలా ఆడుతున్నారు. మనం దానికి ఎలా కౌంటర్ వేయాలి అని చూపించలేకపోయింది. ఫిమేల్ కంటెస్టెంట్స్ లో అనీమాస్టర్, సిరి, శ్వేతా, కాజల్, వీళ్లు ఇచ్చిన కంటెంట్ ని తను ఇవ్వలేకపోయింది.
4. లోబోతో చేసిన రొమాన్స్ అంతగా పండలేదు. క్యూట్ గా ఉందనుకున్నారు కానీ, చాలా ఆడ్ గా ఉంది. ఆల్రెడీ పెళ్లి అయిన ఇద్దరూ పిల్లలు ఉన్న ఇద్దరూ ఇలాంటి కామెడీ చేస్తే ప్రేక్షకులకి రుచించలేదు. దాన్ని వాళ్లు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకే ఓటింగ్ లో తేడా కొట్టింది. ఇక లోబో కూడా నామినేషన్స్ లో ఉండటం అనేది కూడా ఉమాదేవి ఓటింగ్ పర్సెంటేజ్ ని తగ్గించింది.
5. లాస్ట్ డే నటరాజ్ మాస్టర్ డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు చాలామంది మాస్టర్ కి ఓట్ వేయమని క్యాంపైన్ చేశారు. దీంతో ఓటింగ్ అండ్ మిస్డ్ కాల్స్ విపరీతంగా చేశారు. సెలబ్రిటీ గ్రూప్స్ లో కూడా ఓట్ ఫర్ మాస్టర్ అని ఫోటోస్ పెట్టారు. అలాగే తమ తోటి డ్యాన్సర్స్ కూడా ప్లీజ్ సేవ్ మాస్టర్ అంటూ పోస్టర్స్ సోషల్ మీడియాలో తెగ షేర్లు చేశారు. ఇది చాలా ప్లస్అయ్యింది నటరాజ్ మాస్టర్ కి. అందుకే స్వల్ప ఓట్ల తేడాతో సేఫ్ అయ్యారు.
మరో విషయం ఏంటంటే., ఉమాదేవి ఆటపై కంటే కూడా అదర్ యాక్టివిటీస్ పై ఫోకస్ పెట్టింది. మిగతా వాళ్లందరూ టాస్క్ ఆడుతుంటే, కిచెన్ లో ఎక్కువసేపు టైమ్ గడిపింది. ఇదే విషయాన్ని సరయు చెప్పే ప్రయత్నం చేసింది. ఎవరికి వాళ్లు గేమ్ ఆడుకుంటున్నారు. తనని ఆడనివ్వలేదంటూ చెప్పింది సరయు. కొన్ని ఉమాదేవికి పాజిటివ్ గా ఉన్న అంశాలని బిగ్ బాస్ చూపించలేకపోయారు. ఈ కారణాల వల్ల ఉమాదేవి ఎలిమినేట్ అయ్యింది.