‘పాడుతా తీయగా’ సింగర్ ఆశ్రిత్ కు సింగర్ హేమచంద్రకి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

‘పాడుతా తీయగా’.. ఈ షో పేరు చెప్పగానే అందరికీ దివంగత స్టార్ సింగర్ ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం గారే గుర్తుకొస్తారు. ఆయన ఈ షోలో కంటెస్టెంట్లకు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా హైలెట్ గా నిలిచేవి. ఈ షోకి చాలా చరిత్ర ఉంది. 1996 వ సంవత్సరంలో ఈ షో మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో నలుమూలలా ప్రతిభ ఉన్న గాయనీ గాయకులను ప్రోత్సహించడం కోసం రామోజీరావు గారితో కలిసి ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం గారు ఈ షోని ప్రారంభించడం జరిగింది.

ఈ షో ద్వారా మట్టిలో మాణిక్యాలు ఎన్నో బయటపడ్డాయి. పలు సినిమాల్లో ఈ పాటలు పాడే అవకాశాలను కూడా కొంతమంది దక్కించుకున్నారు. మరికొంతమంది అయితే తెలుగు సినిమాల్లో నటించే పరభాషా నటీనటులకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని దక్కించుకుంటున్నారు. బాలు గారు మన మధ్య లేకపోవడంతో ఆయన స్థానంలో ఆయన తనయుడు చరణ్ గారు ఓ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సునీత కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షో ద్వారా పాపులర్ అయిన పిల్లాడు ఆశ్రిత్ అందరికీ సుపరిచితమే.

ఇటీవల జరిగిన పిల్లల సీజన్లో ఇతను టాప్ 3 గా నిలిచాడు. ఇతను పాటలు పాడే విధానం పెద్దలతో పాటు పిల్లలను కూడా బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఇతను స్టార్ సింగర్ హేమచంద్రతో దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఆశ్రిత్ మరెవరో కాదు హేమచంద్రకి మేనల్లుడు. హేమచంద్ర అక్క హిమ బిందుకి పెద్ద అబ్బాయి ఆశ్రిత్. భవిష్యత్తులో ఇతను కూడా తన మామ హేమచంద్రలా స్టార్ సింగర్ అవుతాడేమో చూడాలి. ఇక హేమచంద్రతో ఆశ్రిత్ కలిసున్న కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus