Samantha Song: సమంత ఐటెమ్ సాంగ్ హిట్టయ్యిందా లేదా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాలో పుష్ప కూడా టాప్ లిస్టులో ఉంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ మొదటి సారి తన స్టైల్ కు భిన్నంగా డిఫరెంట్ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. అల్లు అర్జున్ కి కూడా ఇది మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో తప్పకుండా అన్ని భాషల్లోనూ పట్టు సాధించాలి గట్టిగానే కష్ట పడినట్లు తెలుస్తోంది. అయితే ప్రమోషన్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్నంత స్థాయిలో ముందుకు సాగలేకపోయారు.

చివరి దశలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వలన చాలా హడావిడిగా సినిమాను విడుదల చేశారు.అయితే ఈ సినిమాకు సమంత ఐటమ్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చిత్రయూనిట్ సభ్యులు భారీగా ఖర్చు చేసి మరి సెట్ చేసుకున్నారు. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట లిరిక్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా అది ఒక రకంగా ప్రమోషన్లో భాగంగా ఉపయోగపడింది. ఇక సమంతకు ఈ పాట కోసం కోటిన్నర వరకు రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు.

పాట కోసం మొత్తంగా ఐదు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సినిమా అన్ని భాషల్లోనూ సక్సెస్ కావాలి అని పాటల విషయంలో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు.అయితే ఇంతకీ సమంత ఐటెమ్ సాంగ్ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడింది అనే విషయంలో అనేక రకాల సందేహాలు వస్తున్నాయి. సినిమా థియేటర్స్ లో అయితే సమంత గ్లామర్ కు ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు, కన్నడ జనాలు కూడా ఈ పాటను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనే కామెంట్స్ అయితే వస్తున్నాయి.

మొత్తానికి సమంత సాంగ్ పుష్ప సినిమాకు చాలా వరకు హెల్ప్ అయినట్లు అర్థమవుతోంది. సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ కలిస్తే సంగీతం ఎలా ఉంటుందో మరోసారి పుష్ప సినిమాతో రుజువు అయింది. కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రం దేవిశ్రీప్రసాద్ ఇంకా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు అని విమర్శలు కూడా వస్తున్నాయి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus