Jr NTR Dress: అలా నడవడం గర్వంగా ఉంటుంది.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

  • March 13, 2023 / 06:16 PM IST

నాటు నాటు సాంగ్ కు అవార్డ్ రావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆస్కార్ వేడుకలో తారక్ ధరించిన డ్రెస్ హైలెట్ గా నిలిచింది. ఈ డ్రెస్ గురించి తారక్ మాట్లాడుతూ తన డ్రెస్ పై ఉన్న పులి ఆర్.ఆర్.ఆర్ మూవీలో నాతో కలిసి దూకిన పులి అని కామెంట్లు చేశారు. భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించాలనే ఆలోచనతో తాను ఈ డ్రెస్ లో వచ్చానని తారక్ పేర్కొన్నారు.

ఇండియన్ నేషనల్ ఎనిమల్ పులి అని నా డ్రెస్ పై దేశ జాతీయ జంతువు ఉన్న డ్రెస్ ను ధరించి రెడ్ కార్పెట్ పై నడవడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తారక్ చెప్పుకొచ్చారు. ఇలా చేయడం నాకెంతో గర్వంగా ఉందని తారక్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి కూడా షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెలాఖరు నుంచి ఎన్టీఆర్30 షూట్ లో పాల్గొంటానని ఎన్టీఆర్ అన్నారు.

తన స్నేహితుడు కొరటాల శివ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మహేష్ సినిమాను పూర్తి చేసిన తర్వాత రాజమౌళి ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. రాజమౌళి ఈ సినిమా గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

రాజమౌళి పారితోషికం సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. రాజమౌళి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జక్కన్న రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. జక్కన్న మహేష్ కాంబో మూవీ కూడా ఆస్కార్ సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ మూవీకి రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus