బాలీవుడ్ స్టార్ కపుల్ అయిన రణ్‌భీర్ కపూర్,అలియా భట్ లు హీరో, హీరోయిన్లుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1 : శివ’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’… హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగులో ఈ చిత్రం ‘బ్రహ్మాస్త్రం'( మొదటి భాగం శివ) పేరుతో రిలీజ్ అవ్వగా …. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.
రాజమౌళి ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించడం.. నాగార్జున కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషించడం,చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడంతో తెలుగులో ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ‘బ్రహ్మాస్త్రం రెండవ భాగం : దేవ్’ గురించి కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. కానీ ‘బ్రహ్మాస్త్ర’ హిందీ ఇంకా మిగిలిన భాషల్లో కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది కాబట్టి.. రెండో భాగం తెరకెక్కడం కష్టమేనేమో అనే అనుమానాలు కూడా బి-టౌన్ లో వినిపిస్తున్నాయి.
రెండో భాగం కనుక ఉంటే.. మొదటి భాగంలో చనిపోయిన షారుఖ్, నాగార్జున పాత్రలు బ్రతికొస్తాయని దర్శకుడు తెలిపినట్టు ఇన్సైడ్ టాక్. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘బ్రహ్మాస్త్ర’ కథ.. ‘ప్రాజెక్ట్ కె’ కథ ఒక్కటే అనే కామెంట్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ‘బ్రహ్మాస్త్ర’ లో హీరో చేతికి శక్తి ఉంటుంది. అలాగే ‘ప్రాజెక్ట్ కె’ లో కూడా ప్రభాస్ చేతికి శక్తి ఉంటుందట. కానీ ఆ విషయం ప్రభాస్ కు కూడా తెలీదట.
అతనికి ఉన్న శక్తి వల్ల చనిపోయారు అనుకుంటున్న సూపర్ నేచురల్ హీరోస్ కూడా బ్రతికొస్తారని తెలుస్తుంది. ఇది పక్కా టైం ట్రావెల్ కథ అని టీం ఇప్పటికే చెప్పింది. కానీ ‘బ్రహ్మాస్త్ర’ లైన్ తీసుకుని అయాన్ చేసిన తప్పే.. నాగ్ అశ్విన్ చేయడు కదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో..!
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?