భారీ బడ్జెట్ సినిమా అంటే సెట్‌లో హడావిడి వుంటుంది. అందులోనూ ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాకి అయితే చెప్పనవసరం లేదు. సెట్‌లో వందల మంది వుంటారు. ఇదంతా కరోనాకి ముందు. కరోనా లెక్కలు అన్నిటినీ మార్చింది. సెట్‌లో మినిమమ్ జనాలతో షూట్ చెయ్యాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. కొవిడ్19 మహమ్మారి దెబ్బకి ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ కూడా మినిమమ్ క్రూతో వర్క్ చేస్తోంది. ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
యాక్చువల్లీ… భారీ బడ్జెట్, స్టార్ హీరోలు & డైరెక్టర్లు వర్క్ చేస్తున్న సినిమా లొకేషన్లకు వెళ్తే లంచ్ టైమ్ లో ఒక హడావిడి వుంటుంది. అందరూ కలిసి భోజనం చేస్తారు. అటువంటి హడావిడికీ కరోనా చెక్ పెట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ సెట్ లో లంచ్ టైమ్ లో యూనిట్ సభ్యులు అందరూ భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరి భోజనం వాళ్ళకు ప్యాక్ చేసి ఇస్తున్నారు. టేబుల్స్ దూరంగా అరేంజ్ చెయ్యడంతో పాటు దూరం దూరంగా కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే… హీరోలు, డైరెక్టర్లు ఎవరి భోజనం వాళ్ళు ఇంటి దగ్గర నుండి ప్యాక్ చేయించుకుని తెప్పించుకుంటున్నారు. సాధారణంగా హీరోలు, హీరోయిన్లకు ఇంటి భోజనమే వస్తుంది. డైటింగ్ గట్రా వుంటాయి కాబట్టి. ప్రొడక్షన్ యూనిట్ కూడా వాళ్ళ కోసం స్పెషల్ గా ఫుడ్ వండుతుంది. కరోనా తరువాత ప్రొడక్షన్ ఫుడ్ ‘ఆర్ఆర్ఆర్’లో స్టార్స్ తీసుకోవడం లేదట. రాజమౌళి ఫ్యామిలీలో అందరూ వర్క్ చేస్తారు కాబట్టి తమకోసం స్పెషల్ గా కుక్ చేయించుకుంటున్నార్ట.