Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా.. వెనుక ఇంత ఉందా?
- June 13, 2025 / 05:34 PM ISTByPhani Kumar
అల్లు అర్జున్ (Allu Arjun) కి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. టాలీవుడ్లో కాదు కాదు, సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమల్లో ఏ హీరోకి లేని విధంగా మలయాళంలో అల్లు అర్జున్ (Allu Arjun) కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అల్లు అర్జున్ తర్వాత విజయ్ (Vijay Thalapathy) , సూర్య (Surya) ..లకి కూడా అక్కడ మంచి క్రేజ్ ఉంది. అక్కడి హీరోల సినిమాలకు పోటీగా.. బన్నీ సినిమాలు అక్కడ మంచి ఓపెనింగ్స్ సాధిస్తాయి. కానీ ‘పుష్ప 2’ (Pushpa 2) మాత్రం అక్కడ డిజాస్టర్ అయ్యింది.
Allu Arjun
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన ‘పుష్ప 2’ (Pushpa 2) … మలయాళంలో డిజాస్టర్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ‘పుష్ప 2’ (Pushpa 2) అంత లౌడ్ యాక్షన్ మూవీస్ ను అక్కడి జనాలు చూడరు.మరోపక్క ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ ను తక్కువ చేసి చూపించారు అనే అభిప్రాయాలు కూడా మలయాళ సినీ పరిశ్రమ నుండి వ్యక్తమయ్యాయి. నిజంగానే ఫహాద్ ఫాజిల్ పాత్రలో ఇందులో బి- గ్రేడ్ టచ్ తో ఉంటుంది. అందుకే అక్కడి జనాలు హర్ట్ అయ్యి ‘పుష్ప 2’ (Pushpa 2) ని ఇగ్నోర్ చేసినట్టు అంతా భావిస్తున్నారు.

దీన్ని బన్నీ కూడా సీరియస్ గా తీసుకున్నాడనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. అల్లు అర్జున్ (Allu Arjun) ని ఎక్కువగా లేపింది మలయాళం వాళ్ళే. ‘పుష్ప’ (Pushpa) రాకముందు నుండి మలయాళం మీడియా వల్లనే అతని పేరు నేషనల్ మీడియాలో మార్మోగింది. ‘పుష్ప 2’ మలయాళంలో ప్లాప్ అయ్యాక కూడా.. నేషనల్ మీడియా దీనిని ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందుకే ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు.. మలయాళం ఫిలిం మేకర్స్ చెప్పే కథలు వింటున్నాడు.

ఆల్రెడీ తమిళ మార్కెట్ కోసం అట్లీ (Atlee) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మలయాళ దర్శకుడు బాసిల్ జోసఫ్ చెప్పిన కథకి కూడా బన్నీ ఓకే చెప్పినట్టు టాక్ నడుస్తుంది. ‘శక్తిమాన్’ అనే టైటిల్ తో ఓ సోసియో ఫాంటసీ మూవీగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇది కన్ఫర్మ్ అయితే బన్నీ మలయాళ మార్కెట్ మళ్ళీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది.











