సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలిరోజే ఈ సినిమాకు 35 కోట్ల రూపాయలకు అటూఇటుగా కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో కలెక్షన్ల విషయంలో భీమ్లా నాయక్ రికార్డులను క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే ఈ సినిమాకు దర్శకునిగా సాగర్ కె చంద్రకు ఛాన్స్ రావడం వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయి.
అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలతో సాగర్ కె చంద్ర యావరేజ్ హిట్లను సొంతం చేసుకున్నారు. ఈ రెండు సినిమాలతో దర్శకునిగా సాగర్ కు మంచి మార్కులు పడ్డాయి. సాగర్ రవిబాబు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడంతో పాటు కమ్యూనిజం భావాలు ఉన్న వ్యక్తి కావడం గమనార్హం. క్రికెట్ క్రీడాకారుడి లైఫ్ స్పూర్తితో సాగర్ తెరకెక్కించిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమా చూసి సాగర్ కె చంద్రకు పవన్ భీమ్లా నాయక్ సినిమాకు పని చేసే ఛాన్స్ ఇచ్చారని సమాచారం.
సాగర్ కె చంద్ర ప్రతిభను చూసి పవన్ ఛాన్స్ ఇవ్వగా పవన్ నమ్మకాన్ని సాగర్ నిలబెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన సాగర్ కె చంద్ర పవన్ కళ్యాణ్ కు అనుగుణంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సాగర్ కె చంద్ర తర్వాత ప్రాజెక్టుల వివరాలు తెలియాల్సి ఉంది. మరో స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే మాత్రం సాగర్ కె చంద్ర దశ తిరిగిపోతుందని చెప్పాలి. సాగర్ కు భీమ్లా నాయక్ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది.
సాగర్ కె చంద్ర కెరీర్ పరంగా మరింత ఉన్నత స్థానాలకు ఎదగటానికి పవన్ కళ్యాణ్ తన వంతు సహకారం అందిస్తుండటం గమనార్హం. భీమ్లా నాయక్ సక్సెస్ సాధించడంతో భవిష్యత్తులో సాగర్ కె చంద్ర పవన్ కళ్యాణ్ కు మరో ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. భీమ్లా నాయక్ సక్సెస్ తో సాగర్ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరతారేమో చూడాలి.