Aarthi Agarwal: ఆయన వల్లే నీ స్నేహం సినిమాలో ఆర్తి అగర్వాల్ ని హీరోయిన్గా తీసుకున్నారా..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు తమ అభిమానులకు ఎల్లప్పటికీ గుర్తుండిపోతారు. అలాంటి వారిలో ఆర్తీ ఆగర్వాల్ కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ ఆర్తీ ఆగర్వాల్ ఒకరు. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు హృదయాల్లో చేరగాని ముద్ర వేసింది. అయితే అదే సమయంలో ఉదయకిరణ్ హీరోగా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అలా మనసంతా నువ్వే సినిమాను ఎం ఎస్ రాజు నిర్మాతగా వి ఎన్ ఆదిత్య దర్శకుడిగా రూపొందించారు.

మనసంతా నువ్వేసినిమాతో వీ ఎన్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమయ్యారు. సినిమా షూటింగ్ లో ఉండగానే పెద్ద హిట్ అందరూ బలంగా నమ్మారు. దాంతో ఈ చిత్ర నిర్మాత ఎం ఎస్ రాజు తన నెక్స్ట్ సినిమాను కూడా ఉదయ్ కిరణ్ తో చేయాలని ఫిక్సై అడ్వాన్స్ ఇచ్చాడు. అలా నీ స్నేహం సినిమాకి అంకురార్పణ జరిగింది. అయితే, కథ మొత్తం తయారయ్యాక హీరోయిన్‌గా ఉదయ్ పక్కన ఎవరిని పెట్టాలా అని చిత్ర బృందం డిస్కర్షన్ పెట్టుకున్నారు.

వీరిలో పరుచూరి బ్రదర్స్ కూడా ఉన్నారు. కొందరేమో ఉదయ్ తో అప్పటికే హీరోయిన్ గా నటించిన రీమా సేన్ ని తీసుకుంటే హ్యాట్రిక్ హిట్ కొట్టొచ్చునని సలహా ఇచ్చారు. కానీ, ఎం ఎస్ రాజుకి మాత్రం ఆల్రెడీ రెండు సినిమాలు కలిసి చేశారు కాబట్టి బోర్ ఫీలబ్వుతారు ఆడియన్స్ అని ఆర్తీ అగర్వాల్ వైపు చూపు తిప్పారు. అప్పటికే, టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ హాట్ టాపిక్ గా మారింది.

తోలి సినిమా కంటే ఆ తర్వాత సినిమాలకి (Aarthi Agarwal) ఆర్తీ అగర్వాల్ తన అందాన్ని రెట్టింపు చేసింది. దాంతో నీ స్నేహం సినిమాకి ఆర్తీని హీరోయిన్‌గా తీసుకోవాలని ఆమెని తీసుకుంటే పాజిటివ్ వైబ్స్ ఏంటో చెప్పి అందరినీ కన్విన్స్ చేశారట. ఇక ఫైనల్ గా నిర్మాతే చెప్పారు కాబట్టి నీ స్నేహం సినిమాలో ఉదయ్ కిరణ్ పక్కన ఆర్తీ అగర్వాల్ ఫిక్స్ అయింది. స్క్రీన్ మీద ఈ కాంబినేషన్ చాలా బావుంటుందని నమ్మిన నిర్మాత నమ్మాని ఈ జంట నిలబెట్టి మంచి సక్సెస్ ను అందించారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus