ఇండియన్ సినిమాకి ఆస్కార్ వచ్చింది అంటే.. ‘ఆ సినిమాలో హీరో దరిద్రుడు అయ్యుండాలి, లేదా ఆ సినిమా కథ మొత్తం దరిద్రం చుట్టూ తిరగాలి’. ఆ సినిమా జనాలను ఎంత వరకు అలరించింది అనే విషయాన్ని కనీసం పరిగణలోకి తీసుకోరు ఆస్కార్ సభ్యులు అని అంటూ చాలా మంది అంటుంటారు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో అదే నిజమని ప్రూవ్ అయినట్లు తెలుస్తుంది. ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా మంచి అప్లాజ్ వచ్చింది.
థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఎలా ఉన్నా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా 10 వారాల పాటు ట్రెండింగ్లో నిలిచింది. సినిమా చూసిన హాలీవుడ్ డైరెక్టర్స్, రైటర్స్ కూడా ఈ చిత్రాన్ని అభినందించడంతో పాటు, ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు లభిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఇండియాలోనే అసలైన అడ్డంకిని ఆర్.ఆర్.ఆర్ అధిగమించలేకపోయింది.
ఇండియా తరఫున అధికారిక ఆస్కార్ ఎంట్రీగా గుజరాతీ సినిమా ” చెల్లో షో “ను ఎంపిక చేశారు. ఈ సినిమా ఉన్నట్టు కూడా చాలా మందికి తెలీదు.’చెల్లో షో’ అంటే ”ఆఖరాట” అని అర్థం. ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపాలని కమిటీ నిర్ణయించింది. ట్రిపుల్ ఆర్ సినిమా భారత్ తరపున అధికారిక ఎంట్రీ అయితే .. ఉత్తమ విదేశీ కేటగిరి చిత్రంలో పోటీ పడే అవకాశం ఉండేది.
కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదనే చెప్పాలి. కానీ విడిగా ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడే అవకాశం ఉందట. ఈ వార్త తెలిసినప్పటి నుండి ఆర్.ఆర్.ఆర్ ఫ్యాన్స్ మరియు తెలుగు సినీ ప్రముఖులు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు.