ఒకప్పుడు హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం ఉండేది. తర్వాత సినిమాల ఫలితాలను బట్టి థియేటర్ల వద్ద కొట్లాట లు చోటు చేసుకునేవి. అయితే ట్విట్టర్ దయవల్ల ట్వీట్ల యుద్దానికి అది తగ్గింది.అది చాలా వరకు బెటరే. అయితే ఇక్కడ హీరోల సినిమాల ఫస్ట్ లుక్ ల దగ్గర నుండే యుద్దాలు మొదలవుతున్నాయి. అలాగే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ బర్త్ డే ట్యాగ్ లు ట్రెండ్ చేయడం వంటివి కూడా మనం చూస్తూనే ఉన్నాం.
అయితే ఈ మధ్యన దానికి స్వస్తి చెప్పి ఓ కొత్త ట్రెండ్ కు నాంది పలికారు. అదే హీరోల పాత సినిమాలను 4K లకు మార్చి రీ రిలీజ్ లు చేయడం. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి చిత్రాన్ని 4K కి మార్చి మళ్ళీ విడుదల చేశారు. అక్కడి నుండీ ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జల్సా ని కూడా అలాగే చేశారు. అటు తర్వాత బాలయ్య చెన్నకేశవ రెడ్డి చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేయడం జరిగింది.
రీ రిలీజ్ లతో వచ్చే డబ్బుని ట్రస్ట్ లకు వంటి వాటికి దానం చేస్తామని విడుదల చేసే ముందు చిత్ర బృందాలు చెబుతున్నాయి. వాళ్ళు నిజంగా అలా చేస్తారో లేదో తెలీదు కానీ అటు ఎంటర్టైన్మెంట్, ఇటు తమ హీరో పేరు చెప్పుకుని ట్రస్ట్ కు డబ్బులు దానం చేస్తున్నాము అనే ఫీలింగ్ తో అభిమానులు కూడా టికెట్ లు తెగ కొనేస్తున్నారు. అయితే ఓ సినిమాని రీ రిలీజ్ చేసే ముందు .. ఆ చిత్ర బృందాలు ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
ఏదో ప్రింట్ లు అందుబాటులో ఉన్నాయి కదా అని వాటిని రీ రిలీజ్ చేయడం కాదు. అసలు విడుదల చేయాలి అనుకున్న సినిమాలో ఫ్యాన్స్ స్టఫ్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇటీవల ప్రభాస్ నటించిన రెబల్ సినిమాని రీ రిలీజ్ చేశారు. అలాగే నితిన్ అడవి చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేశారు. అవి డిజాస్టర్ సినిమాలు.
రెబల్ సినిమాలో ఒకటి రెండు సీన్లు తీసేస్తే ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసే సన్నివేశాలే అందులో ఎక్కువ ఉంటాయి. ఇక అడవి సంగతి చెప్పనవసరం లేదు. అలాగే ప్రభాస్ పుట్టినరోజు నాడు బిల్లా చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పై అభిమానులకే ఆసక్తి లేదు. ఏ మిర్చి, ఛత్రపతి … వంటివి అయితే పర్వాలేదు. కనీసం యోగి, బుజ్జిగాడు వంటి చిత్రాల్లో అయినా బోలెడంత ఫ్యాన్స్ స్టఫ్ ఉంటుంది. ప్రభాస్ అనే కాదు ఏ హీరో సినిమా రీ రిలీజ్ చేయాలి అన్నా ఇవి గుర్తుంచుకుంటే బెటర్.