Manchu Vishnu: మంచు విష్ణు ఆఫీస్లో దొంగతనం..అతని పై కేసు నమోదు!

  • February 28, 2022 / 12:46 PM IST

‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు, ప్రముఖ హీరో అయిన మంచు విష్ణు ఆఫీస్ లో దొంగతనం జరగడం హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే… మంచు విష్ణు ఆఫీస్లో రూ.5 లక్షలు విలువ గల హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని ఎవరో చోరీ చేశారట.ఈ విషయం పై మంచు విష్ణు మేనేజర్ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో విష్ణు హెయిర్ డ్రెస్సర్‌ అయిన నాగ శ్రీను పై అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు సంజయ్ పోలీసులకి తెలిపారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం… దాంతో పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ విషయం పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో మంచు విష్ణు ఏదో ఒక టాపిక్ తో వార్తల్లో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న తాను నిర్మించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ పై పనిగట్టుకుని కొందరు ట్రోలింగ్ కు పాల్పడ్డారని నోటీసులు పంపారు విష్ణు.

అంతేకాకుండా అంతకు ముందు విష్ణు తండ్రి మోహన్ బాబు కూడా ఇద్దరు హీరోలు కొంతమందిని ఏర్పాటు చేసుకుని.. ‘తన పై అలాగే తన కుటుంబం పై ట్రోలింగ్ చేయించడమే పనిగా పెట్టుకున్నారని’ చెప్పి సంచలనం సృష్టించారు. ఇక టికెట్ రేట్ల ఇష్యు పై స్వయంగా మంత్రి పేర్ని నానిని ఇంటికి పిలిపించుకుని మరీ హాట్ టాపిక్ అయ్యింది మంచు ఫ్యామిలీ. అంతేకాకుండా విష్ణు స్వయంగా ఏపి ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి వెళ్ళడం, ఏపిలో స్టూడియో కట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలపడం కూడా వైరల్ అయ్యింది.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మంచు ఫ్యామిలీనే ఎందుకు ప్రతీసారి వార్తల్లో నిలుస్తుంది అనే అనుమానాలు కూడా జనాలకి కలుగుతున్నాయి. మరి విష్ణు ఆఫీస్ లో దొంగతనం ఇష్యు ఎప్పటికి సాల్వ్ అవుతుందో చూడాలి..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus